»   » శ్రీవారి పాదల చెంతకు... ‘రుద్రమదేవి’

శ్రీవారి పాదల చెంతకు... ‘రుద్రమదేవి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి' సినిమా అక్టోబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గుణశేఖర్, అనుష్క, రుద్రమదేవి యూనిట్ సభ్యులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా తొలి కాపీని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ....శ్రీవారి ఆశీస్సులతో ‘రుద్రమదేవి' సినిమా మొదలు పెట్టానని, మూడు సంవత్సరాల పాటు విజయవంతంగా సినిమా తెరకెక్కించానని, ఇపుడు ఫైనల్ కాపీ సిద్ధమైందని, దాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు.


Rudrama Devi Movie Team offers prayers at Tirumala

రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కించారు.


ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు గొప్ప చిత్రాన్ని తీసావని దర్శకుడిని అభినందించడంతో పాటు యు /ఏ సెన్సార్ సర్టిఫికేట్ అందించారు. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు గుణశేఖర్ తెలిపారు.


Rudrama Devi Movie Team offers prayers at Tirumala

ఈ సినిమాను స్పెషల్ బెనిఫిట్ షోను హైదరాబాద్ లోని శ్రీమాములు థియేటర్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9వ తేదీ తెల్లవారు ఝామున 1 గంట నుండి 3 గంటల మధ్యలో షో వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షో టికెట్స్ కావాల్సిన వారు 8374095398, 8142011679 నంబర్లను సంప్రదించవచ్చు.


ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ సినిమాలో హైలెట్ కాబోతున్నాడు. చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Rudrama devi Movie Team has visited Tirumala to take the blessings of Lord Venkateswara on the verge of its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu