»   » 7 కోట గోడల భారీ సెట్‌లో ‘గోనగన్నారెడ్డి’ అల్లు అర్జున్

7 కోట గోడల భారీ సెట్‌లో ‘గోనగన్నారెడ్డి’ అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్‌లో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలోని గోన గన్నారెడ్డి పాత్రను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఈ పాత్ర చిత్రీకరణ ఈ రోజు(జులై 4)న హైదరాబాద్‌లోని గోపనపల్లిలో తోటతరణి సారథ్యంలో వేసిన ఏడు కోట గోడల భారీ సెట్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ...'ఈ రోజు గోన గన్నారెడ్డి పాత్ర చిత్రీకరణ ప్రారంభించాం. తోట తరణిగారు వేసిన ఏడు కోట గోడల అద్భుతమైన సెట్‌లో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌తో చిత్రీకరణ ప్రారంభించాం. అల్లు అర్జున్‌తో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులతో 40 రోజుల పాటు ఏక ధాటిగా షూటింగ్ జరుగుతుంది.

ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు అనుష్క, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణం రాజు, హంసా నందిని ఇంకా చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటారు. గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ సరసన నటిస్తున్న కేథరిన్ కూడా పాల్గొంటారు. 40 రోజుల పాటు అల్లు అర్జున్ పాల్గొనే ఈ షెడ్యూల్‌తో రుద్రమదేవి దాదాపుగా పూర్తవుతుంది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అద్భుతంగా సెట్ అయ్యారు. ఈ సన్నివేశాలను చాలా లావిష్‌గా హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తున్నాం. 'రుద్రమదేవి' చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్ర స్పెషల్ గా ఉంటుంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏకధాటిగా షూటింగ్ జరుపుతున్నాం' అన్నారు.

'Rudrama Devi' shooting in Seven Wall Fort Set

రుద్రమ దేవిగా అనుష్క నటిస్తున్న ఈ మూవీలో ఇంకా రానా, కృష్ణం రాజు, సుమన్, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్ కుమార్, వేణు మాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీ రాజా, సమ్మెట గాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష తదితరులు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజూనర్: నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయి బాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్ గోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.

English summary
Guna Sekhar - Anushka's historical epic 'Rudrama Devi' presented by Ragini Guna, the first historic stereoscopic 3D film in Indian history is shooting some hair raising war sequences from today at a special set erected by Thota Tarani in Gopanapally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu