»   » ‘రుద్రమదేవి’ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?

‘రుద్రమదేవి’ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క టైటిల్ రోల్ లో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి' చిత్రం విడుదలైన తొలి వారం బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్లు సాధించింది. అయితే తర్వాత బ్రూస్ లీ, కంచె విడుదలతో వసూళ్లు క్రమ క్రమంగా తగ్గు ముఖం పట్టడం ప్రారంభం అయింది.

తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రుద్రమదేవి తొలి రెండు వారాల్లో ఏపీ, తెలంగాణల్లో రూ. 31.98 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి టాక్స్ మినహాయింపు ఇవ్వడం నిర్మాతలకు ఊరటనిచ్చే అంశం.


ఇక రుద్రమదేవి తమిళ వెర్షన్ అక్టోబర్ 16న విడుదలైంది. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు రూ. 2.55 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ఏలో రుద్రమదేవి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో కలిసి రుద్రమదేవి చిత్రం తొలి రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.08 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


రుద్రమదేవి చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మళయాలం భాషల్లో రిలీజైంది. మరి ఫుల్ రన్ లో సినిమా ఎంత వసూలు చేస్తుందనేది హాట్ టాపిక్ అయింది.


నైజాం

నైజాం


రుద్రమదేవి చిత్రం నైజాంలో రూ. 13.70 కోట్లు వసూలు చేసింది.


సీడెడ్

సీడెడ్


సీడెడ్ లో రుద్రమదేవి చిత్రం రూ. 5.65 కోట్లు వసూలు చేసింది.


వైజాగ్

వైజాగ్


వైజాగ్ లో రుద్రమదేవి చిత్రం రూ. 3 కోట్ల మేర వసూలు చేసింది.


గుంటూరు

గుంటూరు


గుంటూరు ఏరియాలో రుద్రమదేవి చిత్రం రూ. 2.70 కోట్లు వసూలు చేసింది.


కృష్ణ

కృష్ణ


కృష్ణ ఏరియాలో రుద్రమదేవి చిత్రం రూ. 1.63 కోట్లు రాబట్టింది.


నెల్లూరు

నెల్లూరు


నెల్లూరు ఏరియాలో రుద్రమదేవి చిత్రం రూ. 1.35 కోట్లు రాబట్టింది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి


వెస్ట్ గోదావరి ఏరియాలో రుద్రమదేవి చిత్రం రూ. 1.60 కోట్లు వసూలు చేసింది.


ఈస్ట్

ఈస్ట్


ఈస్ట్ గోదావరిలో రుద్రమదేవి చిత్రం రూ. 2.35 కోట్లు రాబట్టింది.


English summary
Rudramadevi, which had a decent run initially, dropped drastically after the release of Bruce Lee and Kanche in most of the areas despite the holiday season in Telugu states. The film reportedly collected a share of 31.98 Cr share in Andhra Pradesh and Telangana alone after two weeks.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu