twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ గా ఉంది: 'రుద్రమదేవి' వీడియో సాంగ్‌

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 9 న విడుదల అవుతోంది. చిత్రంలోని 'ఔనా నీవేనా..' వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్‌ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు.

    .గుణశేఖర్‌ తన సొంత బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో అనుష్క, అల్లు అర్జున్‌, రానా, నిత్యా మేనన్‌, కేథరిన్‌ త్రెసా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 9న 'రుద్రమదేవి' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతోందీ ఈ చిత్రం. 'రుద్రమదేవి' చిత్రంలో అనుష్క రుద్రమదేవిగా నటించిన విషయం తెలిసిందే. ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పోషించారు.

    హిందీ వెర్షన్ సైతం అదే రోజు రిలీజ్ కు సిద్దమవుతోంది. రిలియన్స్ వారు హిందీలో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో హిందీ వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసిన వారు సూపర్ గా ఉందని మెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా హిందిలో మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు.

    దర్శకనిర్మాత మాట్లాడుతూ '' సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.

    RUDRAMADEVI - Auna Neevena Video Song

    మరో ప్రక్క 'రుద్రమదేవి' కి కొత్త ప్రయోగంతో ముందుకు వస్తున్నారు. కళ్లద్దాలు లేని త్రీడిలో తమ సినిమాని చూడెపడతాను అంటున్నారు. ఆ ఎక్సపీరియన్స్ పూర్తి డిటేల్స్ ఇక్కడ...

    సాధారణంగా త్రీడి సినిమాలను చూడడానికి ప్రత్యేక కళ్లజోళ్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కళ్లజోళ్లు అవసరం లేకుండానే త్రీడీ సినిమా చూడగలిగితే అనే ఆలోచనను నిజం చేయబోతున్నారు. అలాంటి ఎక్సపీరియన్స్ నే 'రుద్రమదేవి' సినిమా ఇవ్వనుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని వినియోగించారు దర్శకుడు గుణశేఖర్‌.

    'ఎన్‌హ్యాన్స్‌డ్‌ డెప్త్‌ సొల్యూషన్‌' (ఈడీఎస్‌) అనే విధానం ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన 'యింగ్‌ గ్రూప్‌' సంస్థ ఆధ్వర్యంలో జేమ్స్‌ ఆష్‌బే, మైల్స్‌ ఆడమ్స్‌ బృందం ఈ పనులు నిర్వహిస్తోంది. 'కింగ్‌ కాంగ్‌', 'కుంగ్‌ ఫూ పాండా', 'ఇన్‌సెప్షన్‌', 'అవతార్‌' వంటి చిత్రాలకు త్రీడీ విభాగంలో ఈ సంస్థ పని చేసింది.

    గుణశేఖర్ మాట్లాడుతూ ''రుద్రమదేవి'ని టూడీ, త్రీడీ విధానాల్లో తెరకెక్కించారు. అయితే త్రీడీలో సినిమా చూసే అవకాశం అందరికీ ఉండదు. అన్ని ప్రాంతాల్లో థియేటర్లకు త్రీడీ కళ్లద్దాలను అందించలేని పరిస్థితి. అందుకే అందరికీ త్రీడీ అనుభూతి కలిగించాలని యింగ్‌ గ్రూప్‌ను సంప్రదించాం. వాళ్లకు త్రీడీ విధానంలో మంచి అవగాహన ఉంది. టూడీ థియేటర్లలోనూ త్రీడీ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించే ఈడీఎస్‌ విధానం గురించి చెప్పారు. అలా టూడీలో చిత్రీకరించిన సినిమాను ఈడీఎస్‌ ద్వారా మార్పు చేశాం'' అని వివరించారు.

    ఈడీఎస్‌ విధానంలో ఫొటో డెప్త్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రతి ఫ్రేమ్‌ మీద రెండు సార్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే డెప్త్‌ పెంచే క్రమంలో రీల్‌లోని బొమ్మల రంగులు మారాయి. దాంతో మరింత శ్రద్ధ తీసుకుని ఆ తేడా కనిపించకుండా చేశారు. ఫైట్ సీన్స్ విషయంలో ఈడీఎస్‌ మార్పు కష్టమైంది. అయినా జాగ్రత్తగా కొనసాగించారు. సుమారు ఎనిమిది నెలలుగా ఈ కార్యక్రమం సాగుతోంది.

    ఈడీఎస్‌ ద్వారా మార్చిన రీల్‌లో ఇమేజ్‌ షార్ప్‌నెస్‌ కొద్దిగా తగ్గినట్టు అనిపించినా సన్నివేశాలన్నీ సహజంగా కనిపిస్తాయి. మరోవైపు కళ్లజోళ్లు పెట్టుకుని చూసేలా కూడా కొన్ని ప్రింట్లను రూపొందిస్తున్నారు. మొత్తానికి 'రుద్రమదేవి' సినిమాను రెండు విధాలుగా చూడొచ్చన్నమాట.ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Here comes the most awaited RUDRAMADEVI -Auna Neevena Video Song.Rudhramadevi is an upcoming Hindi historical film, based on the life of Rudrama Devi one of the prominent rulers of the Kakatiya dynasty in the Deccan Plateau, and one of the few ruling queens in Indian history. The film is being written and directed by Gunasekhar in 3D and features an ensemble cast of Anushka Shetty, Allu Arjun, Rana Daggubati, Vikramjeet Virk, Prakash Raj, Krishnam Raju, Nithya Menen, Baba Sehgal and Catherine Tresa, among others. Anushka Shetty plays the role of Rudrama Devi.The film's soundtrack and background score were composed by Ilaiyaraaja.The film is releasing at 9 October 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X