»   » ‘రుద్రమదేవి’ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదా?

‘రుద్రమదేవి’ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి' చిత్రం ఈ వేసవిలో విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులను పరిశీలిస్తే సినిమా ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.

సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చాలా పెండింగులో ఉన్నాయట. ముఖ్యంగా సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోరు అందిస్తున్న ఇళయారాజ ఇంకా పని పూర్తి చేయలేదట. ఆయన లండన్ వెళ్లి ఈ పని పూర్తి చేయాల్సి ఉందట. విజువల్ ఓఫెక్టు వర్క్ కూడా కాస్త మిగిలి ఉందని అంటున్నారు.


మరో వైపు మే నెలలో ‘బాహుబలి' రిలీజ్ డేట్ ఖరారు చేసారు. ఈ నేపథ్యంలో ‘బాహుబలి'కి దగ్గరగా ‘రుద్రమదేవి' సినిమాను రిలీజ్ చేసే రిస్కు గుణశేఖర్ తీసుకుంటారా? లేక మరేమైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. రుద్రమదేవి రూ. 70 కోట్ల బడ్జెట్ సినిమా కాబట్టి గుణశేఖర్ సోలో రిలీజ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, అవసరం అయితే సినిమాను వాయిదా వేసుకునే ఛాన్స్ కూడా ఉందని టాక్. అయితే హాలీడే సీజన్ అయిన సమ్మర్‌ను మిస్సవడం కూడా మంచిది కాదనేది మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం.


Rudramadevi not releasing in summer?

సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రుద్రమదేవిని ఏప్రిల్ 24న విడుదల చేసేందుకు గుణశేఖర్ ప్రయత్నిస్తున్నాడని, ఎలాగూ బాహుబలి మే 15న కాబట్టి దాదాపు 4 వారాల గ్యాప్ కలిసొస్తుందని అంటున్నారు. గుణశేఖర్ అనుకున్న విధంగా ఏప్రిల్ 24న విడుదల చేస్తే ఓకే...కానీ మిస్సయితేనే కష్టం.


అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈచిత్రంలో గోన‌గన్నారెడ్డిగా అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. రానా ముఖ్యమైన పాత్ర పోషించారు. రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.


అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.


భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకు హైలెట్ కానుంది.


ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా....నిత్యామీనన్, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
According to trade circles, Gunasekhar’s “Rudramadevi” is not looking like it could make to box office for Summer 2015. There are plenty of hurdles for the movie from post-production side to hit the potential holiday season without any delay.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu