»   » ‘రుద్రమదేవి’ ఎందుకు విడుదల కావడం లేదు?

‘రుద్రమదేవి’ ఎందుకు విడుదల కావడం లేదు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి' ఆడియో విడుదలై చాలా రోజులైంది. ప్రస్తుతం ఈ సినిమా అసలు వార్తల్లోనే లేకుండా అయిపోయింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది కూడా తెలియడం లేదు. కనీసం సినిమాను ఏదో ఒక రకంగా పబ్లిసిటీ చేయడం కూడా మానేసారు. దీంతో జనం కూడా అసలు ఈ సినిమా గురించి మెల్లి మెల్లిగా మరిచిపోయే పరిస్థితి మెల్లి మెల్లిగా మొదలైంది.

అసలు ఈ సినిమా ఏమైంది? ఎందుకు రిలీజ్ కావడం లేదని ఆరా తీస్తే....తెర వెనక దర్శకుడు గుణశేఖర్ మల్లగుల్లాలు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. సినిమాను అమ్మడానికి గుణశేఖర్ చాలా కష్టపడుతున్నాడట. ఆయన అనుకున్న రేటు రావడం లేదని టాక్. మరో వైపు సినిమా నిడివి ఎక్కువగా ఉంది, లెంగ్త్ ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకుల సహనానికి పరీక్ష లాంటిదే, ట్రిమ్ చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్ల కోరుతున్నారట.


 'Rudramadevi' release issue

తను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెకెక్కించిన సినిమాను ట్రిమ్ చేయడానికి గుణశేఖర్ ఇష్ట పడటం లేదు. ట్రిమ్ చేస్తే సినిమా రూపం దెబ్బతింటుందని భావిస్తున్నాడట. మరి గుణశేఖర్ ఏం చేస్తాడు? ఎలాంటి నిర్ణయం తీసకుంటున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాను త్వరగా విడుదల చేయకపోతే, కాలం గడిచే కొద్దీ గుణశేఖర్ కు నష్టాలు పెరుగుతాయనేది వాస్తవం.


అనుష్క, రానా ఇతర ప్రధాన పాత్రధారులు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. స్టీరియో స్కోపిక్‌ త్రీడీ విధానంలో తెరకెక్కిన చిత్రమిది. ఇక దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
'Rudramadevi' release issue in talk.
Please Wait while comments are loading...