»   » ‘రుద్రమదేవి’ రొమాంటిక్ సాంగుపై కూడా వివాదం?

‘రుద్రమదేవి’ రొమాంటిక్ సాంగుపై కూడా వివాదం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 13వ శతాబ్ధపు వీరనారి రాణి రుద్రమదేవి జీవితాన్ని 'రుద్రమదేవి' టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్ ఈ చిత్రంలో ఆమె వీరత్వాన్ని మాత్రమే కాదు....రొమాంటిక్ యాంగిల్ కూడా తెరపై ఆవిష్కరించాడట. ‘ఔనా నీవేనా' సాంగ్ ట్రైలర్ విడుదలైనప్పుడే ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

అయితే ఇటీవల విడుదలైన ‘బాహుబలి' సినిమా విషయంలో ‘పచ్చబొట్టేసిన' సాంగ్ వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో ‘రుద్రమదేవి' సినిమా విడుదలైన తర్వాత కూడా ‘ఔనా నీవేనా' సాంగ్ వివాదాస్పదం అవుతుందేమోననే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.


వీరనారి ‘రుద్రమదేవి'ని రొమాంటిక్ యాంగిల్‌లో చూపించడం హద్దుల్లో ఉంటే ఓకే, హద్దు దాటితే మాత్రం విమర్శలు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా సినిమా విడుదలైతేగానీ గుణశేఖర్ రుద్రమదేవిని తెరపై ప్రజంట్ చేసిన విధానం..... ప్రశంసలు అందుకుంటుందో? విమర్శల పాలవుతారో చెప్పడం కష్టం.


Rudramadevi's romantic song to repeat 'Pachchabottesina' controversy?

మగువ అంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్‌.


భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీసామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు. సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకు హైలెట్ కానుందని తెలిపారు. సెప్టెంబర్ 4న ‘రుద్రమదేవి' సినిమా విడుదల కాబోతోంది.ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా....నిత్యామీనన్, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
As the controversy of 'Baahubali' 'Pachchabottesina' song is still boiling, we might soon witness similar controversy as another hot song having Anushka and Rana from upcoming historical flick 'Rudramadevi' is coming soon, on September 4th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu