»   » గుణశేఖర్‌ ‘ప్రతాప రుద్రుడు’ నిర్మించేందుకు దిల్ రాజు రెడీ!

గుణశేఖర్‌ ‘ప్రతాప రుద్రుడు’ నిర్మించేందుకు దిల్ రాజు రెడీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎంతో కష్టపడి తీసిన సినిమా ‘రుద్రమదేవి' సక్సెస్ కావడంతో దర్శకుడు గుణశేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో కాకతీయ రాజుల్లో ఒకరైన ‘ప్రతాప రుద్రుడు' కథతో గుణశేఖర్ మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

రుద్రమదేవి విడుదలకు ముందే ప్రతాపరుద్రుడు అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన గుణశేఖర్. మంగళవారం రుద్రమదేవి సక్సెస్ మీట్‌లో ‘ప్రతాపరుద్రుడు' ప్రస్తావన తెచ్చారు. నిర్మాత దొరికితే ఈ సినిమా తీసేందుకు సిద్ధమన్నారు. దీంతో అక్కడే ఉన్న దిల్ రాజు వెంటనే స్పందించారు. ప్రతాపరుద్రుడు సినిమాకు తాను నిర్మాత బాధ్యతలను తీసుకుంటాననీ, వెంటనే కథ రెడీ చేసుకోమని చెప్పేశారు.


మంగళవారం జరిగిన రుద్రమదేవి సక్సెస్ మీట్ విశేషాల్లోకి వెళితే...దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలిమగుణ, కృష్ణం రాజు, అనుష్క, అల్లు అర్జున్, సిరివెన్నెల, దిల్ రాజు తదితరులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ ‘తాండ్ర పాపారాయుడు' తర్వాత వచ్చిన హిస్టారికల్ మూవీ ‘రుద్రమదేవి' అన్నారు. అనుస్క వేరియస్ ఉన్న నటన ప్రదర్శించింది, గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ చక్కగా ఒదిగి పోయాడు. ప్రకాష్ రాజ్ తో పాటు ప్రతి ఒక్కరూ బాగా నటించారని కృష్ణంరాజు అన్నారు.


స్లైడ్ షోలో మరిన్ని వవరాలు...


అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ మాట్లాడుతూ...‘స్త్రీ శక్తి తెలియజేసే చిత్రమిది. ఈ సినిమా కోసం నేను కేవలం ముప్పై రోజులు కష్టపడితే అనుష్క మూడేళ్లు కష్టపడింది. ఈ సినిమాకు అనుష్కే హీరో. గుణశేఖర్ మంచి సినిమా తీసారు. ఇందులో నేను భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు.


ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...‘తెలుగు సినిమా వైపు మరోసారి ప్రపంచమంతా తిరిగి చూసేలా చేసిన చిత్రమిది. అనుష్క పడ్డ కష్టం నేనెక్కడా చూడలేదు. గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ అదరగొట్టారు. ఈ సినిమా కథ వినగానే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడకుండా నటించాను అన్నారు.


గుణశేఖర్‌ ‘ప్రతాప రుద్రుడు’ నిర్మించేందుకు దిల్ రాజు రెడీ!

గుణశేఖర్‌ ‘ప్రతాప రుద్రుడు’ నిర్మించేందుకు దిల్ రాజు రెడీ!

గుణశేఖర్ మాట్లాడుతూ...‘సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ముందుగా థాంక్స్. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నపుడు నువ్వొక సంకల్పంతో తెలుగు చరిత్రను తెరకెక్కిస్తున్నావ్ అంటూ ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు పాజిటివ్ ఎనర్జీ అందించేవారు. ఈ సినిమాలో నటించినందుకు బన్నీకి రుణపడి ఉంటాను. అనుష్క ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. రుద్రదేవుడు, రుద్రమదేవిగా అనుష్క మంచి వేరియేషన్ చూపింది. నిర్మాత దొరికితే ‘ప్రతాపరుద్రుడు' కథతో కూడా సినిమా చేస్తాను అన్నారు.


గుణశేఖర్‌ ‘ప్రతాప రుద్రుడు’ నిర్మించేందుకు దిల్ రాజు రెడీ!

గుణశేఖర్‌ ‘ప్రతాప రుద్రుడు’ నిర్మించేందుకు దిల్ రాజు రెడీ!

దిల్ రాజు మాట్లాడుతూ ‘ఇలాంటి గొప్ప సినిమాకు పని చేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ముందుగా అభినందనలు. 2105లో విడుదలైన ‘బాహుబలి', ‘రుద్రమదేవి' తెలుగు సిమా స్థాయిని పెంచాయి అన్నారు. గుణశేఖర్ చెప్పినట్లు ‘ప్రతాపరుద్రుడు' సిని తీస్తే నేను నిర్మించడానికి రెడీ అన్నారు.


English summary
Rudramadevi success meet held at Hyderabad.
Please Wait while comments are loading...