Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 1 hr ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Sports
ఇదంతా ఓ కలలా ఉంది.. చాలా ఒత్తిడికి గురయ్యా: నటరాజన్
- News
షర్మిల కొత్త పార్టీ:చర్చ్ స్ట్రాటజీ: పోప్ జాన్‌పాల్-2 ప్రసంగంతో లింక్: రెడ్లందరినీ: సీబీఐ మాజీ డైరెక్టర్
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యూత్ ని పట్టుకోవాలంటే ఈ పాట్లు తప్పవు మరి (ఫొటో)
హైదరాబాద్ : ఈ రోజున ఏ సినిమా కైనా యూత్ థియోటర్ కి వెళ్లి ఆదరిస్తేనే హౌస్ ఫుల్స్ అయ్యి భాక్సాఫీస్ లు బ్రద్దలు అవుతున్నాయి. దాంతో దర్శక,నిర్మాతలు ఆ దిసగానూ తమ ప్రమోషన్ ని చేస్తున్నారు. తమ చిత్రంలో యూత్ ని ఆకట్టుకునే దృశ్యాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. తాజాగా చారిత్రక చిత్రంగా రూపొందుతున్న 'రుద్రమదేవి' చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ క్రింద మీరు చూస్తున్న ఫొటోని విడుదల చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇది చూసిన వారు ఇదీ ఆ స్టాటజీలో భాగమే అంటున్నారు. యూత్ ...కూడా తమ చారిత్రక చిత్రానికి కనెక్టు కావాలంటే ఇలాంటి ప్రయత్నాలు చెయ్యాల్సిందే అంటున్నారు టాలీవుడ్ వాసులు. నిత్యామీనన్, కాథరిన్ థెరిసా, అనుష్క ఇలా హాట్ గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు.
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క అల్లు అర్జున్ ..గోన గన్నారెడ్డిగా కనిపించిన ఈ ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి.

ఇక దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు,తమిళ,మళయాళ వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.
దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ కలవటం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.
దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్‌లలో షూటింగ్ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.
రాణీ రుద్రమది ఓ అద్భుతమైన ప్రయాణం. ప్రపంచ చరిత్రలో ఆమె స్థానం పదిలం. ఈ తరానికి ఆమె కథ తెలియాలి. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సాంకేతికంగా ఈ సినిమాని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. అనుష్క కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది . రాణీ రుద్రమ కదనరంగంలోనే కాకుండా కళా రంగంలోనే గొప్ప కళాకారిణి అని, కత్తిపట్టినా, కాళ్ళకు గజ్జె కట్టినా ఆమెకు సాటి ఆమేనని ఈ చిత్రంలో దర్శకుడు తెలియజేయనున్నాడు.
అమ్మాయిలంటే అందాల రాశులే కాదు, వీరనారీలు కూడా. ప్రేమ, కరుణ విషయంలో సున్నితమనస్కులే. కానీ శత్రు సంహారం చేయాల్సినప్పుడు అపరకాళీ అవతారం ఎత్తుతారు. రుద్రమదేవి కథ కూడా అలాంటిదే. రుద్రమదేవి తెగువ, ధైర్యం స్త్రీ జాతికే గర్వకారణం. ఆమె సాహసాలకు మేం తెర రూపం ఇస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.
భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.
ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'