»   » నా అనారోగ్యానికి కారణం మీడియానే...కత్రినా కైఫ్

నా అనారోగ్యానికి కారణం మీడియానే...కత్రినా కైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఎంత కష్టపడ్డా నీరసంగా ఉండే వ్యక్తిని కాను. కాకపోతే ఇటీవల మీడియాలో నా మీద పుట్టుకొస్తున్న రూమర్స్ గురించే ఆలోచించి ఆరోగ్యం చేతులారా పాడు చేసుకున్నాను. అంటోంది కత్రినా కైఫ్. కత్రినా ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నారు. డాక్టర్స్ పరీక్ష చేసి...సరైన నిద్ర లేకపోవడం..ముంబయి నుంచి చిత్రీకరణ కోసం అటు ఇటు ఎక్కువగా తిరగాల్సి రావడం..ఆమెను బాగా ఇబ్బందికి గురి చేసి ఉండొచ్చని..ఇదే ఆమె అనారోగ్యానికి కారణమని చెప్పారు. కానీ కత్రిన మాత్రం వాటిని ఏ మాత్రం ఒప్పుకోవటం లేదు. తనపై మీడియా చేస్తున్న దుష్పచారమే తన హెల్త్ పాడుచేసిందని చెప్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..ఐశ్వర్యరాయ్‌తో నాకు పడటంలేదని ఆమె గతంలో నటించిన వాణిజ్య ప్రకటనలు నేను కావాలని ఒప్పుకొని నటిస్తున్నాని ప్రచారం చేస్తున్నారు. అలాగే 'రాజ్‌నీతి' సినిమాలో విదేశీ వనిత సారా థామ్సన్‌గా నేను చేసిన పాత్ర నాకు నచ్చలేదని కూడా పుకారు సృష్టించారు. కావాలని ఎవరో ఇదంతా పనిగట్టుకు చేస్తున్నట్టు అనిపిస్తోంది. వీటి వల్లే మానసిక ఒత్తిడి పెరిగింది. ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడింది...అయితే మీడియా వర్గాలు మాత్రం కత్రినా అంత రూమర్స్ కి భయపడి ఆరోగ్యం పోగొట్టుకునేంత బలహీనురాలు కాదని, అయినా అవి రూమర్స్ అని అందరికీ తెలిసినప్పుడు ఆమె ఖండిస్తే సరిపోతుంది కానీ ఆరోగ్యం పాడుచేసుకుంటే ఏమొస్తుంది అంటున్నారు. అయినా గ్లామర్ గేమ్ లో ఇవన్నీ తప్పవని చెప్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu