»   » ‘ఊపిరి’: ఆ వార్తలు , కేవలం రూమర్సే, ఖండించిన నిర్మాత

‘ఊపిరి’: ఆ వార్తలు , కేవలం రూమర్సే, ఖండించిన నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన 'ఊపిరి' చిత్రం క్రితం నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టైంది. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ విషయమై ఓ టాక్ బయిటకు వచ్చింది.

14 కోట్లకు తమిళ, తెలుగు శాటిలైట్ రైట్స్ సన్ నెట్ వర్క్ వారికి అమ్మేసారని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ విషయం నిజం కాదని, ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్మలేదని పివిపి సినిమా వారు స్వయంగా చెప్తున్నారు.


పీవిపికి చెందిన వారు చెప్తున్నదాని ప్రకారం ఇంకా డీల్ క్లోజ్ కాలేదు. ఇంకా ఓపెన్ గానే ఉంది. శాటిలైట్ రైట్స్ ఇంకా ఎవరికి అమ్మలేదు. పివిపి అధినేత ని మీడియావారు సంప్రదిస్తే ఇదే విషయం స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం టాక్స్ నడుస్తున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. అన్ని ఆప్షన్స్ ఓపెన్ గానే ఉన్నాయి అని చెప్తున్నారు.


Rumours on Nag's Oopiri are Wrong!

ఈ విషయం ప్రక్కన పెడితే నాగార్జున , నిర్మాతలు ఈ చిత్రం విషయమై చాలా హ్యాపీగా ఉన్నారు. ఓవర్ సీస్ లో ఈ సినిమా బాగా కలెక్టు చేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఓ మంచి సినిమా అని రిలీజైన మార్నింగ్ షో నుంచే ఈ సినిమాకు పేరు వచ్చింది.


నాగార్జున మాట్లాడుతూ...జీవితాంతం వీల్‌చెయిర్‌లో వుండేవారు ఎంత ఇబ్బంది పడతారో తనకు తెలుసునని, అమ్మ కూడా ఆర్థరైటిస్ సమస్యతో ఎనిమిదేళ్లు ఇబ్బంది పడడం చూసి చాలా బాధపడేవాడినని, 'ఊపిరి' సినిమా చేయడంవల్ల జీవితంలో స్వేచ్ఛ విలువ ఏంటో తెలిసిందని నాగార్జున తెలిపారు. ఈ చిత్రంలో వీల్‌ఛెయిర్‌లో జీవితాన్ని గడిపే పాత్రలో నాగార్జున నటించారు


నాగార్జున మాట్లాడుతూ...మందు శరీరానికే కాని మనసుకు కాదని, వీల్‌ఛెయిర్‌లో వుండేవారు డిజేబుల్డ్ వ్యక్తులు కాదని, డిఫరెంట్ ఏబుల్డ్ వ్యక్తులుగా తాను భావిస్తానని అన్నారు. వారిని చిన్నచూపు చూసేవారికి పాజిటివ్ థింకింగ్ వుండాలని చెబితే, వారితో ఏదైనా సాధించవచ్చునని ఓ సందేశాన్ని ఈ చిత్రం ఇచ్చిందని ఆయన తెలిపారు.


Rumours on Nag's Oopiri are Wrong!

కార్తి చెల్లెలను తన చెల్లెలుగా భావించి వారి సమస్యను తీర్చిన సందర్భంలో ఎమోషన్, ఆ సన్నివేశంలోనే తాను చెల్లెలి పెళ్లికోసం పెయింటింగ్స్ వేసుకోవాలంటూ కామెడీ చేసే కార్తి, అలాగే తన కాళ్ళపై వేడినీరు పోసే సీన్, ఇలాంటివి మనసుకు నచ్చే అనేక సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలిపారు.


ఈ చిత్రం తరువాత ఆలోచనా విధానంలో మానసికంగా మార్పులు వచ్చాయని, ఈ సినిమాలో హీరోలు, స్టార్లు లేకుండా కేవలం పాత్రలే కనబడతాయని, ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి నమ్మకాన్ని మరింత పెంచారని ఆయన అన్నారు.


ఈ సినిమా చేయడం ఓ ఎమోషనల్ జర్నీగా తాను భావిస్తున్నానని, జీవితంలో తోడు అవసరమని చెప్పే ఈ చిత్రం అనేకమంది జీవితాలపై ప్రభావం చూపిస్తున్నందుకు ఆనందంగా వుందని, ఈ చిత్రంతో తమ బాధ్యత పెరిగిందని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. మనుషుల మధ్య సంబంధాలను అందంగా తెలియజేసే చిత్రంగా ఊపిరి రూపొందిందని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు.

English summary
PVP Cinema came out in open and denied Oopiri satellite rights were sold for a fancy price of Rs 14 Crore . Talks are going on. Nothing has been closed yet. All options are open."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu