»   » శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సెన్సార్ రిపోర్ట్...

శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సెన్సార్ రిపోర్ట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'రన్ రాజా రన్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో విడుదలకు సంబంధించిన విషయాలను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

కొన్ని సీన్లు సరిగా రానందున ఈ చిత్రాన్ని రీ షూట్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని నిర్మాతలు స్పష్టం చేసారు. మిర్చి చిత్రాన్ని నిర్మించిన వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Run Raja Run Movie Censor Report

జూలై 11న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. సీరత్ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రం ద్వారా సుజిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అడవి శేషు, సంపత్, జయప్రకాష్‌రెడ్డి, అలీ, వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: మది, సంగీతం: గిబ్రాన్.యం., ఎడిటర్: మధు, ఆర్ట్: ఎ.యస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

English summary
Sharwanand’s forthcoming film Run Raja Run has completed the censor formalities. The producers of the film are hoping for U/A from the board members. The film is expected to release on August 1 though an official confirmation is awaited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu