చూస్తేనే గుండే జారిపోతోంది., అంత ఎత్తులో ఆ నటి ఏం చేసిందంటే..
మోడలింగ్ అంటేనే వినూత్నంగా ఆలోచించే ఫొటోగ్రాఫర్లకీ, దర్శకులకీ ఒక హద్దులు లేని ఫీల్డ్, రకరకాల వింత, కొత్త ఆలోచనలకి మోడలింగ్ ప్రపంచం నిలయం. ఒక్కోసారి మోడల్స్ తమ ప్రాణాలకు కూదా తెగించటానికి సిద్ద పడటం మామూలే. అయితే ఈ సాహసం మాలుగా అయితే పరవాలేదు కానీ ఏకంగా ప్రాణాలకు తెగిస్తూ చూసేవాళ్ళకీ వొళ్ళు గగుర్పొడిచేలా ఉందే ఫొటోషూట్ ఎప్పుదైనా చూసారా.??
రష్యన్ మోడల్ విక్టోరియా ఒడింక్టోవా చేసిన ఓ డేరింగ్ స్టంట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దుబాయ్‌లోని 70 అంతస్తుల కాయన్ టవర్‌పై ఒడింక్టోవా ఈ స్టంట్ చేసింది. ఆ 70 అంతస్తుల భవనంపై నుంచి ఆమె వేలాడుతూ ఫొటోలకు పోజిచ్చింది. అయితే ఆ సమయం లోకూడా ఆమె ఏమాత్రం రక్షణ చర్యలు తీసుకోలేదు.

ఆ సమయం లో ఆమెకున్న ఏకైక రక్షణ డైరెక్టర్ అలెగ్జాండర్ టికోమిరోవ్ చేయి మాత్రమే. అతను చేయి పట్టుకోగా.. ఆమె వేలాడుతూ అద్భుతమైన ఫొటోకు పోజిచ్చింది. నిజానికి ఈ ఫొటో గతేడాది డిసెంబర్ 29న తీసింది. అప్పటి నుంచి దీనికి లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. అక్కది వరకూ ఓకే అయితే ఆ ఫొటో షూట్‌కు సంబంధించి తాను ఆ డేరింగ్ స్టంట్ ఎలా చేసిందో చూపే వీడియోను ఈ మధ్యే ఆమె పోస్ట్ చేయడంతో ఈ ఫొటోపై చర్చ మళ్లీ మొదలైంది. ఆ చర్చ కాస్తా మరీఎక్కువమంది విమర్షలతో రచ్చకిందకి మారింది

అయితే ఈ ఫొటో షూట్ ఆమెకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా తెచ్చిపెట్టింది. జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండటంపై ఆమెను చాలా మంది విమర్శలు గుప్పించారు. కానీ ఈ తాజా వీడియో మాత్రం వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే 4.2 లక్షల మంది చూడగా.. 51 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. గతంలో బిహైండ్ ద సీన్స్ వీడియోను కూడా ఒడింక్టోవా షేర్ చేసింది. అయితే ఈ వీదియో కి క్రేజ్ మాత్రం మామూలుగా లేదు దీనికి ఇప్పటికే పది లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం.


Click it and Unblock the Notifications











