Just In
- 11 min ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
- 23 min ago
ప్రభాస్ పేరు చెప్పి మోసం: లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. ఆ ప్రొడక్షన్ హౌస్ పనే ఇదంతా
- 24 min ago
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారే..
- 45 min ago
‘రౌడీ’తో అభిజిత్ రచ్చ.. పిక్ వైరల్
Don't Miss!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Sports
ఇంగ్లండ్ ఓపెనర్లూ.. ద్రవిడ్ సలహాలు పాటించండి: కెవిన్ పీటర్సన్
- News
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డి
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'S/O సత్యమూర్తి' ఆన్ లొకేషన్లో ఇలా... (ఫోటోస్)
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘S/O సత్యమూర్తి' ఆడియో వేడుక గ్రాండ్ గా ముగిసింది. ఇక చిత్ర యూనిట్ సినిమా విడుదలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రయత్నంలో పడింది. తాజాగా సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న కానీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన 8న కానీ విడుదలయ్యే అవకాసం ఉంది. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

భారీ అంచనాలు
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గత సినిమా ‘జులాయి' మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ముగ్గురు హీరోయిన్లు
ఈ చిత్రంలో బన్నీ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్సుగా నటిస్తున్నారు.

ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు.

సాంకేతిక వర్గం
ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

ఫ్యామిలీ మూవీ
ఇటీవల విడుదలై ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఫ్యామిలీ ప్రేక్షకుల్లో నమ్మకాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు అదిరి పోతాయని భావిస్తున్నారు.

నైజాం రైట్స్
తాజాగా అందిన సమాచారం ప్రకారం దిల్ రాజు..ఈ చిత్రం నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ హక్కులను 13కోట్లకు పైనే చెల్లించి సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఆడియోకు
ఇప్పటికే విడుదలైన ఆడియోకి కూడా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ట్రైలర్
ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ మరియు సినిమా ఫ్యామిలీలను టార్గెట్ చేసారని తెలుస్తూండటంతో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

సన్నాఫ్ సత్యమూర్తి
బన్నీ గత సినిమా రేసు గుర్రం భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఫ్యామిలీ ఎంటర్టెనర్
సినిమా టైటిల్ కూడా సాఫ్టుగా ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

విడుదల
ఈ చిత్రం ఏప్రిల్ 2న కానీ, ఏప్రిల్ 8న గానీ విడుదలయ్యే అవకాశం ఉంది.