»   » హాట్ టాపిక్ : రాజమౌళి కొత్త రికార్డ్

హాట్ టాపిక్ : రాజమౌళి కొత్త రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి మరో రికార్డ్ క్రియేట్ చేసారు. రాజమౌళి అఫీషియల్ ఫేస్ బుక్ పేజిలో 5,00,000 మార్క్ ను క్రాస్ చేసింది. మన దేశంలో వేరే ఏ దర్శకుడు పేజీ ఇంత పాపులారిటీ సాధించలేదు. ఈ పేజీలో ఎప్పటికప్పుడు రాజమౌళి ఫోటోలు, తన తాజా చిత్ర విశేషాలు పెడుతూ లైవ్ గా ఉంచటంతో దానికి మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది.


ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క లు నటిస్తున్నారు.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఆర్క మీడియా బ్యానర్ నిర్మిస్తోంది. ప్రభాస్‌, రానా, అనుష్క కాంబినేషన్ లో భారీ ఎత్తున రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రం షూటింగ్ రామౌజీ ఫిల్మ్ సిటిలో వేగంగా జరుగుతోంది. సినిమాకి సంభందించిన కీలకమైన సన్నివేసాలు ప్రత్యేకంగా వేసిన సెట్స్ తీస్తున్నారు. ఈ సీన్స్ లో భాగంగా ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నారు.

S.S.Rajamouli achieves a unique distinction

ఇక ప్రభాస్‌, రానా, అనుష్క.. ముగ్గురూ తమ బలాబలాలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. 'బాహుబలి' కోసం రాజమౌళి ప్రభాస్‌, రానా, అనుష్కకి కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ, పోరాటాల విషయంలో చాలా రోజులు పాటు కఠోరమైన శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు వాటిని ప్రదర్శించి సినిమాని రక్తి కట్టించడానికి ఈ ముగ్గరూ సిద్ధమయ్యారు. ఫిల్మ్‌సిటీలో రూపొందించిన సెట్‌లో వీరిపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వీరికి ఇన్నాళ్లు శిక్షణ ఇచ్చిన రాజమౌళి ఫలితాల్ని పరిశీలిస్తున్నారు.


తొలి షెడ్యూల్ కర్నూలు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా రెండో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రభాస్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తోంది. దర్శకుడు రమ్య కృష్ణకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని ఇవ్వజూపడంతో ఈ పాత్రను చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

English summary
Ace director S.S.Rajamouli has managed to achieve a new and unique distinction now. Rajamouli’s official FB page has crossed the 500,000 mark, making him the most popular Indian director on Facebook. Rajamouli is currently busy with the shooting of ‘Baahubali’. The movie has Prabhas and Rana in the lead roles. Anushka will be seen as the heroine. Arka Media banner is producing the big budget film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu