For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ వీకెండ్ రిలీజయ్యే సినిమాల వివరాలు

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : వీకెండ్ వచ్చేసింది. మళ్లీ టాలీవుడ్ బాక్సాపీసు వద్ద సినిమాల సందడి మొదలైంది. ఈ వారం మూడు సినిమాలు తెలుగులో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు కాగా, మరొకటి హాలీవుడ్ తెలుగు అనువాద చిత్రం.

  గోపీచంద్-తాప్సీ జంటగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన 'సాహసం' చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్ధం అవుతోంది. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో హీరో చేసే సాహసాలు ప్రేక్షకలకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. తాప్సీ అందచందాలు సినిమాకు అదనపు ఆకర్షణ

  లక్ష్మి నరసింహ సినీ విజన్స్ పతాకంపై బి నాగిరెడ్డి, బి. వి. గోపాల్, పి. సుమన్ నిర్మాతలుగా రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం పెళ్లి పుస్తకం, అందాల రాక్షసి మోవీ ఫేం రాహుల్,మేం వయసుకు వచ్చాం ఫేం నీటి టేలర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 12 న విడుదలకు ముస్తాబయింది.

  గోపీచంద్, తాప్సీ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహసం'. అన్ని కార్యక్షికమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘తనకు ఎలాంటి అస్తిపాస్తులు లేవని భావించే ఓ సాధారణ సెక్యూరిటీ గార్డుకు అనుకోని సంఘటనల కారణంగా తనకూ ఆస్తి వుందని తెలుస్తుంది. దాన్ని వెతుక్కుంటూ ఓ ప్రదేశానికి వెళతాడు. అప్పుడు ఏం జరిగిందన్నదే చిత్ర కథ. ఓ వ్యక్తి వ్యక్తిగత కథ ఇది. తన ప్రయాణంలో నిధి అన్వేషణ అనేది ఓ భాగంలా వుంటుందే కానీ ఇది పూర్తిగా నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే కథ కాదు.ఇందులో గోపీచంద్‌ను కొత్తగా చూస్తారు. అతని పాత్ర చిత్రణ కూడా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పక్కవాడి కోటి రూపాయలు కొట్టేయను..అలాగని నా దనిపించిన అర్ధరూపాయిని కూడా వదులుకోను అన్న ఫిలాసఫీతో ఆసక్తికరంగా గోపీచంద్ పాత్ర చిత్రణ వుంటుంది' అని తెలిపారు.

  లక్ష్మి నరసింహ సినీ విజన్స్ పతాకంపై బి నాగిరెడ్డి, బి. వి. గోపాల్, పి. సుమన్ నిర్మాతలుగా రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం పెళ్లి పుస్తకం, అందాల రాక్షసి మోవీ ఫేం రాహుల్,మేం వయసుకు వచ్చాం ఫేం నీటి టేలర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 12 న విడుదలకు ముస్తాబవుతుంది. nఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ అప్పటి పెళ్లి పుస్తకం ప్రేక్షకుల్లో ఎటువంటి ఆదరణను పొందిందో మనందరికీ తెలిసిందే. ఆ తరహాలోనే మా ఈ పెళ్లి పుస్తకం కూడా ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన రొమాన్స్ ని కలగలుపుకుని ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సన్నద్ధమైంది.

  సెన్సేషనల్ మూవీస్ పతాకంపై సినీ స్టార్ సమర్పణలో నిర్మాత గోగినేని బాలకృష్ణ తెలుగులో అందిస్తున్న చిత్రం ‘అంతిమ పోరాటం'. వార్నర్ బ్రదర్స్ తాజా చిత్రం ‘పసిఫిక్ రిమ్' చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. చార్లిహున్నమ్, ఇడ్రిన్ ఇల్లా, చార్జీడే, రాబ్ కజిన్స్ స్కై, మాక్స్‌మార్టిన్ ప్రధానపాత్రధారులుగా గులెర్మో ఏల్‌టోరో దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 12న విడుదలకు సిద్ధమైంది.

  English summary
  Saahasam, Pelli Pustakam coming this weekend. Saahasam is adventure film directed by Chandra Sekhar Yeleti and produced by BVSN Prasad under Sri Venkateswara Cine Chitra starring Gopichand and Taapsee Pannu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X