»   » బావుంది....‘సాహసం శ్వాసగా సాగిపో’ థియేట్రికల్ ట్రైలర్!

బావుంది....‘సాహసం శ్వాసగా సాగిపో’ థియేట్రికల్ ట్రైలర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గౌతమ్ మేనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందని, చైతు-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో ఈ చిత్రం మరో 'ఏమాయ చేసావే' రేంజిలో హిట్టవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

Saahasam Swaasaga Saagipo Theatrical Trailer

ఈ సినిమాకు కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో మధ్య మధ్యలో సినిమాకు సంబంధించిన సాంగ్ టీజర్లు రిలీజ్ చేస్తూ యూత్ లో సినిమాపై అంచనాలు తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.


ఆల్రెడీ చిత్రానికి సంబంధించిన 'వెల్లిపోమాకే' సాంగ్ ఈ ఏడాది జనవరిలో విడుదల చేయగా...కుర్రకారు ఫిదా అయిపోయారు. యూట్యూబులో ఆ సాంగు తెలుగు, తమిళంలో కలిపి కోటికిపైగా హిట్స్ వచ్చాయి. సాధారణంగా గౌతం మీనన్ సినిమాలంటేనే ఒక స్పెషల్ ఫీల్ తో సాగుతాయి. ఇపుడు దానికి ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా తోడవటంతో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాగ చైతన్య, గౌతం మీనన్, ఏఆర్ రెహమాన్ కాంబినేసన్లో అప్పట్లో వచ్చిన 'ఏ మాయ చేసావే' చిత్రం అప్పట్లో క్లాసికల్ హిట్ గా నిలిచి పోయింది. ఇపుడు ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అంటున్నారు.


'ఏ మాయ చేసావె' చిత్రం తెలుగులో నాగ చైతన్య, తమిళంలో శింబు చేసినట్లే.... 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా తెలుగులో చైతన్య, తమిళంలో శింబు చేస్తున్నారు. ఈ సినిమాకు ఎం రవీందర్ రెడ్డి నిర్మాత. సునితా తాటికి చెందిన గురు పిల్మ్స్ బేనర్లో కోన వెంకట్ సమర్పకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

English summary
Saahasam Swaasaga Saagipo Telugu movie Theatrical Trailer. Music by AR Rahman and directed by Gautham Vasudev Menon. #SSSMovie ft. Naga Chaitanya and Manjima Mohan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu