ప్రభాస్‌కు నేనంటే అంత నమ్మకం.. డార్లింగ్‌తో మరో సినిమాపై క్లారిటీ ఇచ్చిన సాహో సుజిత్

టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్ట దర్శకుడు ఎవరంటే అందరూ కూడా సుజిత్ పేరే చెబుతారు. ఆ అదృష్టాన్ని అతను అంతగా యూజ్ చేసుకోలేదు గాని లక్కులో మాత్రం అతను కింగ్ అని కామెంట్స్ చేస్తుంటారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సుజిత్ ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు. ఆల్ మోస్ట్ ప్రభాస్ తో మరొక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మొదటి సినిమాతో బిగ్ హిట్

మొదటి సినిమాతో బిగ్ హిట్

దర్శకుడు సుజిత్ మొదట షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకొని ఆ తరువాత రన్ రాజా రన్ సినిమాతో సినీ దర్శకుడిగా మారాడు. యూవీ క్రియేషన్స్ అతన్ని నమ్మి ఆ అవకాశం ఇవ్వగా మొత్తానికి సుజిత్ ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ సినిమా శర్వానంద్ కెరీర్ కు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

నష్టాలు రాకుండా కాపాడిన ప్రభాస్

నష్టాలు రాకుండా కాపాడిన ప్రభాస్


ఆ తరువాత ప్రభాస్ తో అతను లక్కీ ఛాన్స్ కొట్టేయడం ఎవరు ఊహించలేదు. సాహో కథను సింగిల్ సిట్టింగ్ లో ఒప్పించేశాడు. కథ నచ్చడంతో ప్రభాస్ దర్శకుడిని చాలా బలంగా నమ్మాడు. అయితే సినిమా మాత్రం అభిమానులకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా జస్ట్ నష్టాలు రాకుండా కాపాడేసింది. ఒక విధంగా ప్రభాస్ ఇమేజ్ వల్ల ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి.

ప్రభాస్ తో మరో సినిమా

ప్రభాస్ తో మరో సినిమా

సాహో సినిమాను చూశాక చాలా మంది దర్శకుడిపై కామెంట్స్ చేశారు. మంచి లక్కీ ఛాన్స్ పోగొట్టుకున్నడాని, ప్రభాస్ అనవసరంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కూడా అన్నారు. అయితే సుజిత్ మాత్రం ప్రభాస్ తనను ఇప్పటికి కూడా నమ్ముతాడాని కథ చెబితే కూడా రెడీగా ఉంటాడని సుజిట్ వివరణ ఇవ్వడం ఓ వర్గం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Recommended Video

Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
ఆ ప్రాబ్లం నాకు లేదు

ఆ ప్రాబ్లం నాకు లేదు

చాలామందికి ప్రభాస్ కు కథ చెప్పాలి అంటే కూడా ఛాన్స్ దొరకదని అయితే తనకు మాత్రం ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం లేదని చెప్పాడు. దాదాపు ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి రెడీ అన్నట్లుగా సుజిత్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఆ అవకాశం ప్రభాస్ మళ్ళీ ఇస్తాడో లేదో చూడాలి. ఇక సుజిత్ నెక్స్ట్ ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X