»   » ఏప్రిల్ 18న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం టీజర్‌

ఏప్రిల్ 18న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం టీజర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. డిక్టేటర్ ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను బుధవారం (ఏప్రిల్ 18న) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సాయి శ్రీనివాస్ గత చిత్రం 'జయ జానకి నాయక'కు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం అమెరికాలో లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Saakshyam Teaser will be out on April 18th

యాక్షన్ సీన్స్, డాన్స్ లాంటి అంశాల్లో సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో హీరో చేసే స్టంట్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని చిత్రం బృందం చెబుతోంది.

ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Young talented hero Bellamkonda Sai Sreenivas starrer Saakshyam in the direction of successful director Sriwass is currently in its last leg of shooting. Final schedule going on in USA will be wrapped up shortly. Teaser of Saakshyam will be unveiled on April 18th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X