»   » కుమ్మేసింది: హీరోయిన్ రియల్ బాక్సింగ్ (వీడియో)

కుమ్మేసింది: హీరోయిన్ రియల్ బాక్సింగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాధవన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘సాలా ఖదూస్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో మాధవన్ బాక్సింగ్ కోచ్ గా మెయిన్ రోల్ చేయగా......హీరోయిన్ గా రితిక సింగ్ నటించింది.

 Saala Khadoos heroine Rithika Singh Boxing video

రితిక సింగ్ ఈ చిత్రంలో మహిళా బాక్సర్ గా కనపించారు. రియల్ లైఫ్ లో కూడా బాక్సర్ అయిన రితిక సింగ్..... ‘సాలా ఖదూస్' చిత్రంతో తెరంగ్రేటం చేసారు. ఈ సినిమాలో ఆమె తన నిజ జీవిత పాత్రను పోషించారు. రియల్ బాక్సర్ కావడంతో సినిమాలోనూ అదరగొట్టింది రితిక సింగ్. ఆమెకు సంబంధించి రియల్ బాక్సింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.

మైక్ టైసన్ ఆసక్తి...

ఒకప్పటి బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ బాలీవుడ్ చిత్రం ‘సాలా ఖదూస్'పై మనసు పారేసుకున్నాడు. ఈ సినిమా చూడాలని ఉందని తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించాడు. టైసన్ పోస్టుకు స్పందించిన మాధవన్, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే తన సినిమా చూపించే ఏర్పాటు చేస్తానని ట్వీట్ చేశారు.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మాధవన్ కోచ్ గా నటించిన సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే బాలీవుడ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు అందాయి.

English summary
Here is the Boxing video of Rithika Singh heroine Rithika Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu