»   » సాహో సచిన్.. బయోపిక్ స్పెషల్ స్కీనింగ్‌కు ప్రముఖులు.. ఉద్వేగం.. కంటతడి.. (ఫోటో గ్యాలరీ)

సాహో సచిన్.. బయోపిక్ స్పెషల్ స్కీనింగ్‌కు ప్రముఖులు.. ఉద్వేగం.. కంటతడి.. (ఫోటో గ్యాలరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెట్ మైదానంలో బౌలర్లకు సింహస్వప్పంగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెండితెరపైన హల్‌చల్ సృష్టించేందుకు సిద్దమవుతున్నాడు. తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'సచిన్: ఏ డిలియన్ డ్రీమ్స్' అనే చిత్రం మే 26వ (శుక్రవారం) తేదీ రిలీజ్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో 'సచిన్: ఏ డిలియన్ డ్రీమ్స్' చిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోకు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ, నితా అంబానీ, సినీ ప్రముఖులు అశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, అభిషేక్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, ఏఆర్ రెహ్మాన్, సోను నిగమ్, గుల్షన్ గ్రోవర్, ఫరా ఖాన్, జాన్ అబ్రహం, అనిల్ కపూర్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్, సాగరిక ఘాట్గే, ఆదిత్య థాకరే; కబీర్ ఖాన్, సుశాంత్ సింగ్ , కీర్తీ సనన్ తదితరులు హాజరయ్యారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సచిన్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

కుటుంబంతో సచిన్

కుటుంబంతో సచిన్

ముంబైలో ప్రదర్శించిన ‘సచిన్: ఏ డిలియన్ డ్రీమ్స్' సినిమాకు సచిన్ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. భార్య అంజలి, కూతురు, కుమారుడు వెంట ఉన్నారు.

ఎమోషనల్‌గా

ఎమోషనల్‌గా

ఈ సినిమా స్పెషల్ స్కీనింగ్‌కు రావడం చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నాను. ఈ చిత్రం దేశానికి గర్వకారణంగా నిలిచిపోయే అద్భుత చిత్రం అవుతుంది. ఈ సినిమాను దేశంలో ప్రతీ ఒక్కరికి చూపించాలి అని నేను సచిన్‌కు చెప్పాను అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. అభిషేక్, ఐశ్వర్యతో కలిసి ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.

స్ఫూర్తి పొందుతారు..

స్ఫూర్తి పొందుతారు..

సచిన్ బయోపిక్‌ను చూసి దేశ ప్రజలే కాకుండా, ఓవర్సీస్ అభిమానులు కూడా స్ఫూర్తి పొందుతారు. ఎన్నో ఏళ్లుగా యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సచిన్.. ఈ సినిమా ద్వారా మరింత స్ఫూర్తిని నింపడం ఖాయం. సచిన్ జీవిత కథ ఆధారంగా సినిమా రావడం సంతోషకరం అని షారుక్ ఖాన్ అన్నారు.

ఉద్వేగానికి లోనయ్యా..

ఉద్వేగానికి లోనయ్యా..

ఆరంభం నుంచి సచిన్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. నేను సినిమా చూసి ఉద్వేగానికి లోనయ్యాను. ఫ్యాన్స్‌కు బాగా నచ్చుతుంది. చివర్లో సచిన్ చేసే ప్రసంగం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. సినీ, క్రీడా అభిమానులు ఆదరించడం ఖాయం అని అమీర్ ఖాన్ అన్నారు.

అనిల్ కపూర్, అనుపమ్

అనిల్ కపూర్, అనుపమ్

స్పెషల్ స్కీనింగ్‌కు వస్తున్న బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్

అశుతోష్ గోవారికర్

అశుతోష్ గోవారికర్

సచిన్ బయోపిక్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన దర్శకుడు అశుతోష్ గోవారికర్ దంపతులు, జాన్ అబ్రహం.

సచిన్‌తో రణ్‌వీర్..

సచిన్‌తో రణ్‌వీర్..

సచిన్ చిత్రానికి చూసేందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్

అనుష్క శర్మతో కోహ్లీ

అనుష్క శర్మతో కోహ్లీ

సచిన్ జీవిత కథా చిత్రాన్ని వీక్షించేందుకు తన గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి అనుష్కశర్మతో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

కబీర్ ఖాన్ దంపతులు..

కబీర్ ఖాన్ దంపతులు..

సచిన్ బయోపిక్‌ను చూడటానికి వచ్చిన దర్శకుడు కబీర్ ఖాన్ దంపతులు

సుశాంత్, కీర్తి సనన్

సుశాంత్, కీర్తి సనన్

సచిన్ ప్రీమియర్‌కు హాజరైన బాలీవుడ్ ప్రేమ జంట సుశాంత్ సింగ్, కీర్తి సనన్

సచిన్‌తో కోహ్లీ, అనుష్క

సచిన్‌తో కోహ్లీ, అనుష్క

సచిన్ దంపతులతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

అంబానీ ఫ్యామిలీ..

అంబానీ ఫ్యామిలీ..

సచిన్ ఫ్యామిలీలో ముఖేశ్ అంబానీ కుటుంబం

గురువుతో శిష్యుడు

గురువుతో శిష్యుడు

గురువు రమాకాంత్ అచ్రేకర్‌తో సచిన్ టెండూల్కర్

కాళ్లకు ప్రణామం..

కాళ్లకు ప్రణామం..

గురువు రమాకాంత్ అచ్రేకర్‌ కాళ్లకు మొక్కుతున్న సచిన్ టెండూల్కర్

English summary
A grand premiere was organised for Sachin: A Billion Dreams. The who's who of the country got together to watch the special screening of legendary cricketer Sachin Tendulkar's biography Sachin: A Billion Dreams. Here's all you need to know about what transpired at the premiere of the Sachin biopic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu