»   »  బండ్ల గణేష్ ఓ పిల్లి.. అతడికి ఆ వ్యాధి ఉంది, హీరో సంచలన వ్యాఖ్యలు!

బండ్ల గణేష్ ఓ పిల్లి.. అతడికి ఆ వ్యాధి ఉంది, హీరో సంచలన వ్యాఖ్యలు!

Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో బండ్ల గణేష్ సంచలన నిర్మాత. అప్పటి వరకు సినిమాల్లో చిన్న పాత్రలో నటిస్తున్న నటిస్తున్న బండ్ల గణేష్ ఆంజనేయులు చిత్రంతో ఒక్కసారిగా నిర్మాతగా మారిపోయాడు. గబ్బర్ సింగ్ చిత్రంతో ఈ బండ్ల గణేష్ దశ తిరిగింది. ఆ తరువాత బండ్ల గణేష్ టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాతగా అవతరించాడు. బండ్ల గణేష్ ఎన్టీఆర్ తో చేసిన బాద్షా, టెంపర్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. కాగా బండ్ల గణేష్ కు అదే స్థాయిలో వివాదాలు కూడా ఉన్నాయి. ప్రముఖ హీరో సచిన్ జోషి గతంలోనే బండ్ల గణేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజగా మారో మారు ఆ వివాదం గురించి సచిన్ జోషి ప్రస్తావించాడు.

 ఆంజనేయులు చిత్రంతో యుటర్న్

ఆంజనేయులు చిత్రంతో యుటర్న్

బండ్ల గణేష్ అంజనేయులు సినిమా ముందు వరకు సాదా సీదా నటుడిగా మాత్రమే ఉన్నాడు. అంజనేయులు చిత్రంతో ఒకసారిగా నిర్మాతగా మారి టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్య పరిచాడు.

గబ్బర్ సింగ్ తో దశ తిరిగింది

గబ్బర్ సింగ్ తో దశ తిరిగింది

గబ్బర్ సింగ్ చిత్రం బండ్ల గణేష్ దశనే మార్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్లాపుల నుంచి గట్టెక్కించిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంతో పవర్ స్టార్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. బండ్ల గణేష్ తిరుగులేని నిర్మాతగా అవతరించాడు.

 ఎన్టీఆర్ తో రెండు హిట్లు

ఎన్టీఆర్ తో రెండు హిట్లు

బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మించిన బాద్షా, టెంపర్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీనితో బండ్ల గణేష్ ని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ని పిలవడం ప్రారంభించారు.

 సచిన్ జోషితో వివాదం

సచిన్ జోషితో వివాదం

బండ్ల గణేష్ కు టాలీవుడ్ లో విజయాలతో పాటు అంతే స్థాయిలో వివాదాలు కూడా ఉన్నాయి. బండ్ల గణేష్ తనని మోసం చేసాడని హీరో సచిన్ జోషి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 వివాదం ఏంటి

వివాదం ఏంటి

బండ్ల గణేష్ కు, తనకు మధ్య నెలకొన్న అసలు వివాదం గురించి సచిన్ జోషి ఇటీవల ప్రస్తావించాడు. ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఒరేయ్ పండు చిత్రంతో తనకు గణేష్ పరిచయం అయ్యాడని సచిన్ జోషి తెలిపాడు. తాను డబ్బున్న వ్యక్తిని అని తెలుసుకుని సాయం చేయాలని కోరినట్లు సచిన్ జోషి తెలిపాడు.

 చీటింగ్ చేసాడు

చీటింగ్ చేసాడు

అతడు రిక్వస్ట్ చేయడంతో మా ప్రొడక్షన్ లో చేర్చుకున్నాం అని సచిన్ తెలిపాడు. గణేష్ నిర్మించిన సినిమాలకు ఫైనాన్స్ చేసాం. కానీ డబ్బు తిరిగి చెల్లించాల్సిన సమయంలో అతడి అసలు రంగు బయట పడింది అని సచిన్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 తీవ్రమైన వ్యాఖ్యలు

తీవ్రమైన వ్యాఖ్యలు

సచిన్ జోషి బండ్ల గణేష్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అతడు ఓ పిల్లి. తప్పు చేస్తూ ఎవరూ చూడడం లేదు అని భ్రమలో ఉంటాడు. గణేష్ కు మోసం చేయడం అనే వ్యాధి ఉంది అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

English summary
Sachin Joshi once again made hot comments on Bandla Ganesh. Sachin joshi told how Ganesh cheated him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu