»   » ఫ్రాడ్ చేసావంటూ... బండ్ల గణేష్ మీద ఫైర్ అయిన హీరో!

ఫ్రాడ్ చేసావంటూ... బండ్ల గణేష్ మీద ఫైర్ అయిన హీరో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఆ మధ్య ‘నీ జతగా నేనుండాలి' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్టయిన ‘ఆషికీ 2' చిత్రానికి ఇది రీమేక్. సచిన్ జోషి ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమా విషయంలో బండ్ల గణేశ్, సచిన్ జోషి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు వివాదానికి దారితీసింది. బండ్ల గణేష్ మీద సచిన్ జోషి చీటింగ్ కేసు పెట్టాడు.

‘నీజతగా నేనుండాలి' సినిమా విషయంలో బండ్ల గణేష్ తమను మోసం చేసాడని సినీ నటుడు సచిన్ జోషి‌కి సంబంధించిన వైకింగ్ మీడియా సంస్థ ఈ కేసు పెట్టింది. ఈ చిత్రానికి గణేష్ నిర్మాతగా ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టింది మాత్రం సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా సంస్థనే. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో గణేష్ మోసం చేసాడని, నష్టాలు వచ్చాయని తప్పుడు లెక్కలు చూపాడని ఆ సంస్థ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Sachin Joshi tweets about Bandla Ganesh

ఈ నేపథ్యంలో ఇద్దరూ ట్విట్టర్లో ఒకరిని విమర్శిస్తూ ఒకరు మరొకరు ట్వీట్స్ చేయడం చర్చనీయాంశం అయింది. ఇటీవల బండ్ల గణేష్ ట్విట్టర్లో ఎవరైనా మనల్ని నమ్మినప్పుడు.. మనం చెప్పే ప్రతి కథ నిజమే అని నమ్ముతారు. ఒకవేళ నమ్మకం కోల్పోతే... మనం చెప్పే ప్రతి విషయం ఓ కథేలాగే అనిపిస్తుంది" అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై వెంటనే రియాక్టయిన హీరో సచిన్" నువ్వు చేసిన ఫ్రాడ్ నమ్మించేలా లేదు. ఎవరూ ఎప్పటికీ నమ్మలేని ఫ్రాడ్ ఇది. ఫ్రాడ్ కంటే కూడా ఇది షేమ్ లెస్ "అంటూ ట్వీట్ చేశాడు.

English summary
"More then fraud you are shameless, u dig in the same plate which gave you food. But frauds like you cannot be trustworthy ever to anyone.." Sachiin Joshi tweets about Bandla Ganesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu