twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సచిన్ సెంచురీ మిస్‌తో బాలీవుడ్ గుండె చెదిరింది..

    By Nageswara Rao
    |

    ముంబై స్టేడియంలో భారత్ - వెస్టిండిస్ మద్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వందో సెంచురీ కేవలం 6 పరుగులు దూరంలో ఆగిపోయింది. దాంతో యావత్ ప్రపంచంలో ఉన్న సచిన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురి అయ్యారు. కేవలం అభిమానులే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా నిరాశ చెందాడు. ఈ నిరాశ కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా కలిగింది.

    దాంతో ఆయా బాలీవుడ్ సెలబ్రిటీలు తమయొక్క భావాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, అర్జున్ రాంపాల్, గౌరవ్ కపూర్, మందిరా బేడి, శేఖర్ కపూర్, ఫర్హాన్ ఆక్తర్ తదితరులు ఉన్నారు. వీరి వారియొక్క ట్విట్టర్ ద్వారా అభిమానులకు సచిన్‌పై సందేశం ఎలా ఇచ్చారో చూద్దాం..

    అమితాబ్ బచ్చన్: Oh dear! Believe Sachin out on 95! Heartbroken! Ah well another day maybe… We"ll wait. “Correction: out on 94!! Still heartbroken, but full of hope and conviction that he shall get there someday!!

    శిరిష్ కుందర్: Sachin missed his ton. Sachin missed his ton. The second one was for Pawar whose ears are still ringing.

    అర్జున్ రాంపాల్: Oh no Sachin, damn, so close. Wish u that 100 asap.

    గౌరవ్ కపూర్: NOOOOOOOOOOOOOOO ……… Shit, crap, bloody hell!

    మందిరా బేడి: It was a beautiful, fluent, sachin-esque 94. Let"s be thankful for those 94 runs!!

    శేఖర్ కపూర్: Oh well, next innings. God is just teasing us.

    ఫర్హాన్ అక్తర్: Sad about sachin getting out on 94 but the Aussie tour now has an added edge to it… And to get it there, will be priceless!!

    ఇక సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు 99 సెంచురీలు చేయడం జరిగింది. గత 8 నెలలుగా వందో సెంచురీ కొసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సచిన్ టెండూల్కర్ 99వ సెంచురీ మార్చిలో జరిగిన ప్రపంచ కప్‌లో దక్షణాఫ్రికాపై చేశారు. సచిన్ టెండూల్కర్ వన్డేలలో 48 సెంచురీలు, టెస్టులలో 51 సెంచురీలు చేయడం జరిగింది.

    ఇలా సచిన్ టెండూల్కర్ ఈ మూడవ టెస్టు మ్యాచ్‌తో కలుపుకుంటే తొంభై - వంద పరుగుల మధ్య మొత్తం పది సార్లు అవుట్ అవ్వడం జరిగింది. అదే వన్డే మ్యాచ్‌లైతే 18 సార్లు తన సెంచురీలను మిస్ చేసుకొవడం జరిగింది. ఇలా సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 28 సార్లు తన సెంచురీలను వివిధ జట్లపై మిస్ చేసుకున్నాడు.

    English summary
    Cricket legend Sachin Tendulkar missed his 100th international century by just six runs and it has not only disappointed his fans across the globe, Bollywood celebs are heartbroken too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X