»   » క్రికెట్ గాడ్ ‘సచిన్’ మూవీ టీజర్ రిలీజైంది (వీడియో)

క్రికెట్ గాడ్ ‘సచిన్’ మూవీ టీజర్ రిలీజైంది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రికెట్‌ క్రీడకు మన దేశంలో ఉన్న క్రేజ్ మరే దేశంలోనూ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. ఇండియాలో ఉన్నవి రేండే రెండు మతాలు...అందులో ఒకటి క్రికెట్, రెండోది సినిమా. ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందబోతోంది. ఇండియాలో బాగా ఫేమస్ అయిన ముగ్గురు క్రికెట్ లెజెండ్స్ జీవితాల ఆధారంగా మూడు సినిమాలు వస్తున్నాయి.

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'అజర్' అనే సినిమా రూపొందుతోంది. ఇందులో అజారుద్దీన్ పాత్రను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి పోషిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ జీవితం ఆధారంగా 'ఎంఎస్ ధోని' సినిమా వస్తోంది. ఇందులో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు అనౌన్స్ అయినప్పుడు క్రికెట్ అభిమానులు ఎంత సంతోష పడ్డారో తెలియద కానీ...... ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ జీవితంపై సినిమా వస్తుందని తెలియగానే ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని సంతోషించాడు. 'సచిన్' పేరుతో వస్తున్న ఈ సినిమాలో సచినే స్వయంగా నటిస్తున్నాడు. అంటే సచిన్ జీవితాన్ని మనం స్వయంగా సచిన్ ద్వారానే తెరపై చూడబోతున్నాం అన్నామాట. తాజాగా 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది.

ఈ చిత్రంలో సచిన్ వృత్తి జీవితంలో ఎత్తుపల్లాలు, ఆయన వ్యక్తిగత విషయాలు, చిన్నప్పటి నుండి అంజలితో ప్రేమ, పెళ్లి వరకు అన్ని అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి లండన్‌కు చెందిన ప్రముఖ రచయిత, దర్శక, నిర్మాత జేమ్స్ ఎరిక్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా హాలీవుడ్ రేంజిలో ఉంటుందని అంటున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కోసం యావత్ క్రికెట్ అభిమాన ప్రపంచం ఎదురు చూస్తోంది.

English summary
Teaser trailer of Sachin: A Billion Dreams will be released. A few days ago, the first look poster was unveiled by the makers. Now, the process is going to be followed by its teaser.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu