»   » సినిమాలేంటని మండిపడుతున్న సచిన్ టెండూల్కర్

సినిమాలేంటని మండిపడుతున్న సచిన్ టెండూల్కర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా మంది అడుగుతున్న ఒకే ఒక ప్రశ్నకు సమాధానం ఇదే...నేను ఏ సినిమాలోనూ నటించలేదు అని సచిన్ స్పష్టం చేస్తూ తాజాగా ట్వీట్ చేసారు. ఆయన సినిమాల్లో నటిస్తున్నారంటూ వచ్చిన రూమర్ కి ట్విట్టర్ లో, ఫోన్ ల్లో సమాధానమివ్వలేక సతమతమవుతున్నారు. సచిన్ టెండూల్కర్...విధు వినోద్ చోప్రా సినిమా ద్వారా వెండి తెరపై కనపించబోతున్నాడని వచ్చిన వార్తలును ఖండించారు. సచిన్ 'ఫెరారీ కి సవారి' సినిమాలో నటిస్తున్నాడని భావించిన ఆయన అభిమానులు చాలామంది "మీరు నిజంగానే నటిస్తున్నారా?" అని ట్విట్టర్ ద్వారా సచిన్ కు వేలాదిగా పంపిన ట్విట్ లకు స్పందిస్తూ....తాను ఎటువంటి చిత్రంలో నటించటం లేదని...అవన్ని అవాస్తవాలని స్పష్టం చేసారు. అంతే కాక ఇంకా రెండురోజుల్లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరిస్ జరగబోతుంది ఈ సిరిస్ ను ఒక చాలేంగ్ గా తీసుకుని తన దృష్టి మొత్తాన్ని దానిపైనే సారించినట్టు ట్విట్టర్ లో తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu