»   » క్రికెటర్ సచిన్ మీద సినిమా.. పోస్టర్ రిలీజైంది (ఫస్ట్ లుక్)

క్రికెటర్ సచిన్ మీద సినిమా.. పోస్టర్ రిలీజైంది (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ జీవిత కథ ఆధారంగా జేమ్స్‌ ఎర్క్సిన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'సచిన్‌' అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం పోస్టర్‌ ఈ రోజు విడుదలైంది. సచిన్‌ ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ... ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

సినిమాకు సంబంధించిన టీజర్‌ ఈ నెల 14న మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయబోతున్నారు. 'ఈ చిత్రాన్ని నేను చూడాలి, త్వరగా చూపించవా ఫ్రెండ్‌' అంటూ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌.. సచిన్‌ని కోరుతూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేయడం విశేషం. ఇప్పటికే క్రికెటర్లు... ధోనీ, అజారుద్దీన్ జీవితాలపై సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇపుడు సచిన్ మీద కూడా సినిమా వస్తుండటంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

Sachin Tendulkar's movie first look

ఈ చిత్రంలో సచిన్ వృత్తి జీవితంలో ఎత్తుపల్లాలు, ఆయన వ్యక్తిగత విషయాలు, చిన్నప్పటి నుండి అంజలితో ప్రేమ, పెళ్లి వరకు అన్ని అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి లండన్‌కు చెందిన ప్రముఖ రచయిత, దర్శక, నిర్మాత జేమ్స్ ఎరిక్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా హాలీవుడ్ రేంజిలో ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో స్వయంగా సచినే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కోసం యావత్ క్రికెట్ అభిమాన ప్రపంచం ఎదురు చూస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 14న వెల్లడి కానున్నాయి.

English summary
2016 is set to witness three cricket related movies come to life with all being biopics based on Indian cricketers. The release date for movie on Sachin Tendulkar hasn’t been decided yet but the teaser will go live on April 14th. The flick captures Tendulkar’s cricket and personal life in great detail with Sachin himself featuring in the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu