»   »  సేవ్ చేసుకోండి.... ‘సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్ ’ రిలీజ్ డేట్ ఇదిగో

సేవ్ చేసుకోండి.... ‘సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్ ’ రిలీజ్ డేట్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారత క్రికెట్ ప్రపంచంలో క్రికెట్ గాడ్ గా చరిత్రకెక్కిన ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'సచిన్ : ది బిలియన్ డ్రీమ్స్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు అఫీషియల్ గా ప్రకటించారు.

Sachin Tendulkar's 'Sachin: A Billion Dreams' movie Release date

తేడాది ఏప్రిల్ 14న ఈ బయోపిక్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.....సినిమా ఎప్పుడొస్తుందో? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానులందరికీ సచిన్ టెండూల్కర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ గుడ్ న్యూస్ అందించారు.

సచిన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ... ' ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇదిగో. మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి, డేట్ సేవ్ చేసుకోండి' అంటూ 26.05.17న సినిమా రిలీజ్ అవుతుంది అంటూ ట్వీట్ చేసారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత కధ ఆధారం గా జేమ్స్ ఎరిక్సన్ దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం "సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్". ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో తన పాత్రలో సచినే స్వయంగా నటించడం విశేషం.

English summary
Sachin Tendulkar himself took to his Twitter account and gave to good news to his fans writing, "The answer to the question that everyone's asking me is here. Mark your calendars and save the date. SachinTheFilm releases 26.05.17"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu