For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినీ, క్రీడాభిమానులకు శుభవార్త: తెర వెనుక రానా.. తెరపై సచిన్ టెండూల్కర్

  |

  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెండితెరపై కనిపించబోతున్నాడనే వార్త సినీ, క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అదీ దగ్గుబాటి రానా నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో అనే సరికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆనందం చిగురిస్తోంది. ఇంతకీ సచిన్ కనిపించబోయే సినిమా ఏంటి? అందులో సచిన్ రోల్ ఎలా ఉంటుంది? వివరాల్లోకి పోతే..

  దేశంలోనే మొదటి సారి ఈ తరహాలో

  దేశంలోనే మొదటి సారి ఈ తరహాలో

  ఇప్పటి వరకు ఎన్నో బియోపిక్స్ రూపొందించారు ఫిలిం మేకర్స్. అయితే అవన్నీ కూడా మన దేశానికి చెందిన వ్యక్తులవే. కానీ దేశంలోనే మొదటి సారి మరో దేశానికి చెందిన ఓ లెజెండ్ జీవిత చరిత్రను సినిమాగా మలచబోతున్నారు. దీంతో ఈ బయోపిక్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది.

  రానా నిర్మాణం.. సచిన్ భాగం

  రానా నిర్మాణం.. సచిన్ భాగం

  ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌పై అఫీషియల్‌ స్టేట్‌మెంట్ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఈ సినిమాకు ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకత్వం వహించనున్నాడని, దీనిని సురేష్ ప్రొడక్షన్స్‌, దార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో తాను భాగం కానుండటం పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని రానా పేర్కొన్నాడు. ఇక రానా తెర వెనుక రానా భాగమవుతుంటే, తెరపై సచిన్ భాగమవుతున్నాడని చిత్రయూనిట్ అంటోంది.

  సచిన్‌పై అఫీషియల్ ప్రకటన

  సచిన్‌పై అఫీషియల్ ప్రకటన

  ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో సచిన్ టెండూల్కర్ నటిస్తున్నారనే విషయాన్ని దార్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హెడ్ సేతుమాధవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సేతుమాధవన్ మాట్లాడుతూ "సచిన్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్, మురళీ వరల్డ్ బెస్ట్ బౌలర్.. వీరిద్దరి క్రికెట్ కెరీర్ సమానంగా సాగింది. దీంతో సచిన్ కూడా ఈ ఫిల్మ్‌లో కనిపిస్తారు" అని తెలిపాడు. దీంతో సచిన్ వెండితెర ట్రీట్ కన్ఫర్మ్ అని తేలిపోయింది.

  మురళీధరన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో

  మురళీధరన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నారు. ఇప్పటికే కథా పరమైన చర్చలు కూడా ముగిశాయి. ఇంకాస్త పెండింగ్‌లో ఉన్న స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ కాగానే డిసెంబర్ నెలలో ఈ బయోపిక్‌ని సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ మేరకు విజయ్ సేతుపతి క్రికెట్‌కి సంబందించిన మెళకువలు కూడా నేర్చుకుంటున్నాడు.

  సచిన్, మురళీధరన్‌ వెండితెర ట్రీట్

  సచిన్, మురళీధరన్‌ వెండితెర ట్రీట్

  సచిన్, మురళీధరన్‌లకు మైదానం లోని పిచ్‌తో గొప్ప అనుబంధం ఉంది. వీరిద్దరూ ఎన్నోసార్లు ప్రత్యర్ధులుగా తలపడ్డారు. మురళీధరన్ స్పిన్ మాయాజాలం, దానిపై సచిన్ బ్యాటింగ్ స్టైల్ రెండు దేశాల క్రీడాభిమానులను అలరించేవి. ఇప్పుడు ఆ ట్రీట్ వెండితెరపై చుడనున్నామన్నమాట. ఈ సినిమాకు 800 అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

  ముత్తయ్య మురళీధరన్ ఏమన్నాడంటే..

  ముత్తయ్య మురళీధరన్ ఏమన్నాడంటే..

  తన జీవిత కథకు వెండితెర రూపం రానుండటం పట్ల ముత్తయ్య మురళీధరన్ కూడా స్పందించారు. తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుండటం, విజయ్‌ సేతుపతి లాంటి హీరో అందులో నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ టీమ్‌‌కి తన వంతు సహకారం అందిస్తున్నానని ఆయన చెప్పారు. 2020 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానుంది.

  English summary
  Tamil star Vijay Sethupathi will essay Sri Lankan spin legend Muttiah Muralitharan in a biopic written and directed by MS Sripathy. The film is expected to be titled 800 — after number of wickets the former cricketer has in Tests, the most in history by any bowler.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X