For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాధపడుతున్న రామ్ చరణ్ హీరోయిన్

  By Srikanya
  |

  న్యూఢిల్లీ: ఆస్కార్ అవార్డుల రేసులో 'బర్ఫీ' నిలవకపోవడంపై ప్రియాంక చోప్రా విచారం వ్యక్తం చేసింది. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ సరసన జంజీర్ రీమేక్ లో చేస్తోంది. ఆమె బర్పీ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి ఎంట్రీ దొరకకపోవటంతో మీడియా వద్ద వాపోయింది. అయితే భారత్ తరఫున 'బర్ఫీ' చిత్రాన్ని ఆస్కార్ అవార్డు కోసం అధికారికంగా ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేసింది.

  అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ మూగ, చెవిటివాడిగా నటించగా ప్రియాంక చోప్రా మూగదానిలా నటించింది. 85వ ఆస్కార్ అవార్డుల కోసం విదేశీ భాషా చిత్రాల విభాగంలో 'బర్ఫీ' తప్పకుండా అవార్డును గెలుచుకుంటుందని చిత్రం బృందం కూడా ఆశించింది. అయితే తుది తొమ్మిది చిత్రాల్లో 'బర్ఫీ'కి చోటు దక్కకపోవడంపై బృందం సభ్యులు కూడా నిరాశపడ్డారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటి ఇలియానా కూడా నటించి మంచి మార్కులే కొట్టేసింది.

  ఈ విషయమై ప్రియాంక మాట్లాడుతూ... 'విషయం తెలిశాక చాలా బాధపడ్డా. చిత్రం బృందానికి కూడా ఇదే పరిస్థితి. అయితే భారత్ తరఫున ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం 'బర్ఫీ'కి దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. మనసుపెట్టి చేసిన చిత్రమిది. చిత్రంలోని నా పాత్ర 'జిల్‌మిల్'కు వచ్చిన స్పందన, విమర్శకుల నుంచి వచ్చిన ప్రశంసలు నన్నెంతో సంతృప్తిపర్చాయి. ఇటీవలే జరిగిన మర్రాకెచ్ చిత్రోత్సవాల్లో కూడా 'బర్ఫీ'ని ప్రదర్శించారు. అక్కడి ప్రేక్షకులు చూపిన అభిమానం మరువలేను'అని నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పింది.

  రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' బాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందంటున్నారు. జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ ..విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా,తేజ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి),సంజయ్ దత్(హిందీ వెర్షన్ కి),మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు.

  ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

  English summary
  
 Priyanka Chopra is sad that her film Barfi is out of the Oscar race but the actress says she is glad that the film was sent in as the official entry from India The Anurag Basu-directed film starring Ranbir Kapoor as a deaf and mute boy and Priyanka as an autistic girl was initially in the running to qualify for the best foreign language film category at the 85th Academy Awards but failed to make it to the shortlisted nine films I am very sad about it We as a team are sad about it But I am glad the film was considered and sent as India s official entry to the Oscars It was a very special film for us We made it from the heart and I am really happy for the kind of response I ve got for Jhilmil s character Priyanka told 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X