Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శృంగార ప్రియులకు నిరాశ: ఇండియాలో బ్యాన్ చేసారు
హైదరాబాద్: ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే...ఇటీవల హాలీవుడ్ శృంగార భరితమైన ప్రేమకథా చిత్రం. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ హాట్ మూవీ అమెరికా, బ్రిటన్, యూరఫ్ దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే సెక్స్ కంటెంట్ తీవ్రంగా ఉండటంతో మలేషియా, దుబాయ్, అరబ్ దేశాలు, కెన్యా, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేసారు. తాజాగా ఇండియాలో కూడా ఈ చిత్రంపై నిషేదం విధించారు. సినిమాలో హాట్ సీన్లు కట్ చేసి విడుదల చేస్తారని భావించినప్పటికీ....సినిమా మొత్తం అవే సీన్లు ఉండటంతో నిషేదం విధించ తప్పలేదు.
శృంగార సన్నీవేశాలు పచ్చి పచ్చిగా ఉండటంతో ఈ సినిమా విడుదలైతే దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో ఈ చిత్రాన్ని ఇండియాలో నిషేదిస్తూ సెంట్రల్ సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రం ఇక్కడ విడుదలైతే చూడాలని ఆశ పడుతున్న శృంగార ప్రియులకు ఇది నిరాశే.
ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం అమెరికాలో వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసారు. ఇక్కడ ఈ చిత్రానకి ‘ఆర్' రేటింగ్ ఇచ్చారు. అయితే యూకెలో మాత్రం ఈచిత్రానికి అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. 18 ఏళ్ల లోపు వారు ఈ చిత్రాన్ని చూడటానికి వీలే లేకుండా సర్టిఫికెట్ జారీ చేసారు. అయితే ఫ్రాన్స్‌లో సెన్సార్ బోర్డు మాత్రం ఈ చిత్రంలో సెక్స్ కంటెంట్ అంతగా ఏమీ లేదంటూ 12 ఏళ్ల వయసు వారు సైతం చూడొచ్చని సర్టిఫై చేయడం గమనార్హం. గతంలోనూ ఫ్రాన్స్ లో పలు చిత్రాలకు ఇలాంటి రేటింగే వచ్చింది. యూఎస్, యూకె లాంటి దేశాల్లో పెద్దలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఫ్రాన్స్ లో మాత్రం అందరూ చూడదగ్గ యూనివర్శల్ సర్టిఫికెట్ పొందాయి.

నగ్నసీన్లు
సినిమాలో ఎక్కువగా నగ్న సీన్లు ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి వాటికి స్థానం లేదు.

టాప్ లెస్ సీన్లు
ఈ చిత్రంలో హీరోయిన్ టాప్ లెస్ ప్రదర్శన ఉంది. సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరు.

అభ్యంతరకర సన్నివేశాలెన్నో..
సినిమాలో అభ్యంతర కర సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకే బ్యాన్ చేయక తప్పలేదు.

శృంగార సీన్లు
సినిమాలో శృంగార సీన్ల తీవ్రత ఎక్కువగా ఉంది.