For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కేక పెట్టిస్తున్న సదా హాట్ ఐటం సాంగ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : సాధారణంగా కెరీర్ ఫేడవుట్ అయిపోయిన దశలో హీరోయిన్స్ కు ఐటం సాంగ్స్ వస్తూంటాయి. ఆ మధ్యన ఛార్మి,శ్రియ ఇలాగే ఐటం సాంగ్స్ చేసారు. తాజాగా ఆ ఐటం పాపల లిస్ట్ లో సదా చేరింది. విశాల్ హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ అనే టైటిల్ తో వస్తన్న చిత్రంలో సదా ఐటం సాంగ్ చేసింది. ఆ ఐటం సాంగ్ చాలా హాట్ గా ఉందని, యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. సినిమా సెకండాఫ్ లో ఈ సాంగ్ వస్తుందని చెప్తున్నారు.


  జయం నుంచి అపరిచితుడు చిత్రం దాకా కంటిన్యూగా దాదాపు 30 సినిమాలు దాకా చేసుకుంటూ పోయిన సదా ఆ తర్వాత చల్లబడిపోయింది. ఆమె కెరీర్ పూర్తిగా క్లిక్ లాంటి హర్రర్ సినిమాల స్ధాయికి పడిపోయింది. అప్పటికీ శ్రీకాంత్ సరసన ఆమె అఆఇఈ వంటి సినిమాలు చేసినా అవి డిజాస్టర్ అయ్యి ఆమెను మరింత పడేసాయి. దాంతో ఆమె ఇక్కడ లాభం లేదనుకుంది కన్నడ పరిశ్రమకు వెళ్లి సెటిలైంది. అక్కడా పెద్దగా కలిసిరాకపోవటంతో ఇప్పుడు మళ్లీ ఈ రకంగా ఐటం సాంగ్ తో మళ్లీ తన కెరీర్ ని మొదలు పెట్టాలనుకుంటోంది.

  ఈ ఐటం సాంగ్ కోసం ఆమెకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాల్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కార్తీక హీరోయిన్‌గా నటిస్తోంది. దమ్ముతో తన దమ్ముని చూపించిన కార్తీక ఈ చిత్రంలో మరో సారి గ్లామర్ ని ఓ రేంజిలో ఒలకపోసే పాత్రలో కనిపించనుందని చెప్తున్నారు. ఈ చిత్రంలో సదా విశాల్‌తో సింగిల్ సాంగ్‌కు స్టెప్స్ వేయనుంది. దీని గురించి ఈ ముద్దుగుమ్మ చెబుతూ ఈ తరహా సాంగ్స్‌కు తాను పూర్తి వ్యతిరేకినని చెప్పింది. ఇలాంటి అవకాశాల్ని ఇంతకు ముందు చాలా తిరస్కరించానని అంది. సుందర్ సి యూనిట్ నుంచి ఈ అవకాశం వచ్చినప్పుడు తనకు ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పానని అంది. ఇది సాధారణంగా వచ్చే ఐటమ్ సాంగ్ లాంటిది కాదని చిత్ర కాన్సెప్ట్‌ను వివరించడంతో నటించడానికి అంగీకరించినట్లు సదాతెలిపింది.

  మరో ప్రక్క తెలుగు నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాలని ప్రయత్నం మొదలెట్టింది. శివాజి, సదా జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. సత్తి శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సి.హెచ్.వి.ఎన్.బాబ్జీ, ఎస్.రత్నమయ్య నిర్మాతలు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -''భిన్నమైన కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దయ్యాలనేవి లేవనీ, అదంతా మన భ్రమనీ చెప్పే సినిమా ఇది. 'సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నీ చేతనైతే సాయం చేయ్. అదే నీకు శ్రీరామరక్ష' అనే నీతితో ఈ సినిమా తెరకెక్కుతోంది.


  తెలుగులో నటరాజు తనే రాజు (ఎన్టీఆర్) పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల ఆరున విడుదల చేయనున్నారు తెలుగులో కూడా ఈ పేరు బాగా చొచ్చుకుపోతుందని భావిస్తున్నారు. జెమినీ ఫిలిం సర్క్యూట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశాల్‌ సరసన అంజలి, వరలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్‌ 6న దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మదగజరాజా ఫెస్టివల్ చిత్రమని దర్శకుడు సుందర్.సి అంటుండేవారు. అదే విధంగా ఈ చిత్రాన్ని వినాయకచతుర్థి సందర్భంగా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే సరిగ్గా సెప్టెంబర్ ఆరుకి విశాల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం పూర్తవుతుంది. ఈ సందర్భంగా తన సొంత సంస్థలో తను నటించిన చిత్రం విడుదల కావడం విశేషంగా భావిస్తున్నానని చెప్తున్నారు. విజయ్‌ ఆంటోనీ సంగీతం సమకూర్చారు.

  English summary
  Now Sada is back. She has danced for a song on Vishal starrer Nataraju starrer Raju. It's a scorching number that might put Sada's sagging career. The film is set for release shortly. Vishal will kick start the promotions this week
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more