»   » 'చంద్రముఖి'ని మిస్ చేసుకున్న తార ఎవరంటే..!?

'చంద్రముఖి'ని మిస్ చేసుకున్న తార ఎవరంటే..!?

Subscribe to Filmibeat Telugu

జయం సినిమాతో తెరంగేట్రం చేసిన నటి సదా. అప్పట్లో ఆ సినిమా దర్శకుడు తేజ తాను పనిచేసిన నటీమణుల్లో సదా ది బెస్ట్ అని కితాబు కూడా ఇచ్చాడు. మంచి ప్రతిభ కల నటి అయినా దురదృష్టావశాత్తు ఆమెకు ఆ తర్వత సరైన విజయం లభించలేదు. అపరిచితుడు సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోగలిగింది కానీ అవకాశాలను అందుకోలేకపోయింది. అలా తర్వాత సరైన అవకాశాల్లేని ఆమెకు దర్శకుడు పి.వాసు బంపర్ ఆఫర్ ను అందించినా మరో సారి దురదృష్టావశాత్తు ఆ అవకాశాన్ని అందుకోలేకపోయింది.

కన్నడలో ఘనవిజయం సాధించిన చంద్రముఖి, దీని సీక్వెల్ ఆప్తరక్షక సినిమాల్లో తొలుత ఈమెనే నాయికగా తీసుకోదలచిన వాసు ఆమెను సంప్రదించగా అనివార్య కారణాల వల్ల ఆమె ఆ అరుదైన అద్భుత అవకాశాన్ని అందుకోలేకపోయిందట. ఒకవేళ ఈ రెండు సినిమాలు కానీ సదా చేతిలోపడింటే ఆమె కెరీర్ గ్రాఫ్ ఎక్కడో వుండేది. ఏదిఎలా వున్నా ఇప్పుడామె రెండు కన్నడ చిత్రాలతో బిజీబిజాగా వుంది. ఆమె నటించిన హిందీ చిత్రం క్లిక్ ఇటీవలే విడుదలయింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుతున్నాయి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu