»   »  సదా!నీ సీను అయిపోయినట్లేనా?

సదా!నీ సీను అయిపోయినట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sada
'టక్కరి'పరాజయం అందాల భామ సదాని పరిశ్రమనుంచి దూరం చేసిందనే చెప్పాలి. అపరిచితుడు తో అందరి దృష్టిలో పడ్డ ఈ అందం ఆ తర్వాత కనుమరగైపోయింది. కోలీవుడ్,టాలీవుడ్ అనే తేడాలేకుండా అందరూ పట్టించుకోవటం మానేసారు. ప్రేక్షకులు కూడా ఆమె మీద శీతకన్నేసారనటానికి గుర్తుగా ఆ మధ్య మోహిని అనే కన్నడ డబ్బింగ్ చిత్రం వస్తే ఓపినింగ్స్ కూడా లేకుండా చేసారు. దాంతో అర్ధం కాని స్ధితిలో ఉన్నామెకి తాజాగా ఓ ఆఫర్ రావటం ఆనందాన్నిస్తోంది. అయితే అది సెకండ్ హీరోయిన్ వేషం .

శ్రీకాంత్ హీరోగా చేస్తున్న 'అఆఇఈ' అనే చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా మీరాజాస్మిన్ కనిపిస్తూంటే సదా సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో సదా టాక్సీ డ్రైవర్ శ్రీకాంత్ కి భార్యగా కనిపిస్తుంది. కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఈ చిత్రం పూర్తి స్ధాయి నవ్వులతో నిండి ఉంటుందంటున్నాడు. అయితే పాపం ఒక వెలుగు వెలిగిన సదా నవ్వులుపాలవకుండా ఉంటే చాలనేది ఆమె అభిమానుల ఆకాంక్ష.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X