»   » వివాదాస్పద వ్యాఖ్యలు : షారుక్‌ఖాన్‌ పాకిస్టాన్ ఏజెంట్ (వీడియో)

వివాదాస్పద వ్యాఖ్యలు : షారుక్‌ఖాన్‌ పాకిస్టాన్ ఏజెంట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే వీహెచ్‌పీ నేత సాధ్వీ ప్రాచీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. బాలీవుడ్‌ నటుడు షారూక్‌ఖాన్‌ని పాకిస్థాన్‌ ఏజెంట్‌గా ఆమె పేర్కొన్నారు. షారూక్‌ఖాన్‌ నిన్న తన 50వ పుట్టిన రోజువేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన దేశంలో పెరుగుతున్న 'అత్యంత అసహనం'పై మాట్లాడారు. రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. ఈ నేపథ్యంలో షారూక్‌ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ప్రాచీపై విధంగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.

ఇక...

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'ఫ్యాన్‌'. నేడు షారుక్‌ 50వ పుట్టిన రోజు సందర్భంగా 'ఫ్యాన్‌' ట్రైలర్‌ని చిత్ర యూనిట్ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది.

ఈ చిత్రం డిల్లీలో ఉండే ఆర్యన్ ఖన్నా (షారూఖ్ పాత్ర) చుట్టూతిరుగుతుంది. అతనికి గౌరవ్ అనే పెద్ద ప్యాన్ ఉంటాడు. వీరిద్దరి చుట్టూ కథ తిరుగుతుంది. కథనం ప్రధానంగా చిత్రం ఉండనుందని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2016, ఏప్రిల్‌15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షారూఖ్‌ .. బ్యాండ్‌ బాజా బారత్‌, శుద్ద్‌ దేశీ రొమాన్స్‌' వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్‌ దర్శకుడు మనీష్‌ తివారి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా పేరు 'ఫ్యాన్‌' అనేది ఓ విశేషమైతే.. ఈ చిత్రంలో షారూఖ్‌.. తన ఫ్యాన్‌గా నటించడం మరో విశేషం. కాస్త వెరైటీ.. కాస్త ఆసక్తికరంగా.. మరికాస్త కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్‌ నచ్చడంతో షారూఖ్‌ ఖాన్‌ కూడా వెంటనే ఓకే చెప్పాడని బాలీవుడ్‌ సమాచారం. మరి బాలీవుడ్‌లో ప్రయోగాత్మకమైన చిత్రాలను ఇష్టపడే షారూఖ్‌.. ఈ మూవీతో ఫ్యాన్‌గా తన ఫ్యాన్స్‌ను ఎంత వరకు ఎంటర్‌టైన్‌ చేస్తాడో చూడాలి.

English summary
Motor-mouth Hindu rights activist and Vishwa Hindu Parishad (VHP) leader Sadhvi Prachi, who is in the media limelight for her controversial statements, on Monday, Nov 2, targeted Bollywood superstar Shahrukh Khan. She has called Shah Rukh Khan as a "Pakistani agent". She also suggested that the actor should move to Pakistan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu