»   » కిడ్నాప్, లైంగిక వేధింపులు: షాకైన హీరోయిన్ కాజల్ ఫ్యామిలీ!

కిడ్నాప్, లైంగిక వేధింపులు: షాకైన హీరోయిన్ కాజల్ ఫ్యామిలీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాల చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటిని ఆమె వద్ద గతంలో పని చేసిన కారు డ్రైవర్, మరికొందరు కలిసి ఆమె కారులోనే నిర్భంధించి.. కొచ్చి నగరంలో తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన యావత్ సినీలోకాన్ని షాక్ కు గురి చేసింది.

ఈ ఘటనతో ప్రముఖ నటులు, నటీమణల కుటుంబ సభ్యులు తమ వారి సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పర్సనల్ స్టాఫ్ ను నియమించుకునే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే ఆలోచనలో పడ్డారు.

మళయాల నటి విషయంలో జరిగిన ఘటనతో హీరోయిన్ కాజల్ తల్లి వినయ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇకపై తన కూతురు సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు.

ఇకపై అలా చేయకూడదు

ఇకపై అలా చేయకూడదు

సాధారణంగా ఏదైనా సినిమాకు పని చేస్తున్నపుడు ప్రొడక్షన్ వారు ప్రొవైడ్ చేసే డ్రైవర్లను, పర్సనల్ స్టాఫ్ ను సేఫ్ గానే భావిస్తాం. అయితే ఇకపై వారు పంపే వారిని గుడ్డిగా నమ్మకంగా మేము కూడా వారి బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని హైర్ చేసుకునే సమయంలో పోలీస్ వేరిఫికేషన్ కూడా తప్పనిసరి చేయాలి. సేఫ్టీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని వినయ్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు.

కాజల్

కాజల్

కాజల్ అగర్వాల్ ఏ షూటింగుకు వెళ్లినా తన తండ్రి లేదా తల్లితో కలిసి వెళతారు. ఒక వేళ వారిద్దరూ ఏదైనా పనుల వల్ల రాక పోతే కనీసం నలుగురు పర్సనల్ స్టాఫ్ ఆమె వెంట ఉంటారట.

పెద్ద హిట్

పెద్ద హిట్

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని కాజల్... మెగాస్టార్ చిరంజీవి తో చేసిన ‘ఖైదీ నెం 150' సినిమా ద్వారా పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆమె అంతకు ముందు తెలుగులో నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు

ప్రస్తుతం కాజల్ తెలుగులో రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రం చేస్తున్నారు. దీంతో పాటు తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేగమ్, విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 61వ చిత్రంలోనూ నటిస్తోంది.

English summary
Kajal's Mother Vinay Aggarwal claims to be shocked by the what happened in the case of malayalam actressa. 'Generally, We assume the driver provided by the production house is a safe person to travel with. But now, I myself will be checking the background of the people we hire. Safety is our top priority,' she says, hinting that police verification should done while hiring.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu