»   » తమ్మారెడ్డి భరద్వాజ పై గెలిచిన సాగర్‌

తమ్మారెడ్డి భరద్వాజ పై గెలిచిన సాగర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షునిగా ప్రముఖ దర్శకులు, నిర్మాత సాగర్‌ ఎంపికయ్యారు మరో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పోటీపడి విజయం సాధించి సాగర్‌ ఈ పదవిని కైవసం చేసుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ప్యానల్‌లోని కృష్ణవంశీ ఉపాధ్యక్షునిగా ఎంపిక కాగా ఇదే ప్యానల్‌ నుంచి దర్శకుడు జి.రాంప్రసాద్‌ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. రెండేళ్లు పదవీకాలం కలిగిన పూర్తి కార్యవర్గం వివరాలు ...అధ్యక్షులు: సాగర్‌, ఉపాధ్యక్షులు: ఎ.మల్లిఖార్జున్‌(మల్లి), కృష్ణవంశీ, ప్రధాన కార్యదర్శి: జి.రాంప్రసాద్‌, సంయుక్త కార్యదర్శులు: వడ్డాణం రమేష్‌, కె.రంగారావు, నిర్వాహక కార్యదర్శులు: చంద్రమహేష్‌, కాదంబరికిరణ్‌, కాశీ విశ్వనాథ్‌, కార్యనిర్వాహక సభ్యులు: వి.ఎన్‌.ఆదిత్య, ఎ.ప్రభు, కోటిబాబు.వై, పి.శ్రీనివాసరావు (చెవిపోగు), రాజమౌళి, అళహరి, కోటేశ్వర్రావు, పి.వి.రామారావు. గెలుపొందిన వీరందరికీ ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu