»   »  గోపీచంద్ ‘సాహసం’ ఆడియో జూన్ 2న

గోపీచంద్ ‘సాహసం’ ఆడియో జూన్ 2న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తొలిసారిగా రూపొందిన 'సాహసం' చిత్రానికి సంబంధించిన ఆడియో జూన్ 2న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి విజయవంతమైన చిత్రాలలో నటించిన గోపీచంద్, ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి చిత్రాలతో సత్తా ఉన్న దర్శకుడిగా పేరుపొందిన చంద్రశేఖర్ ఏలేటి తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఛత్రపతి ప్రసాద్ నిర్మించారు.

వారం క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోందని తెలిపారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చంద్రశేఖర్ బాణీలో ఉంటూనే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందిందని, ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని ప్రదేశాలలో ఈ షూటింగ్ చేశామని, తమ సంస్థకు ఓ మంచి విజయవంతమైన చిత్రంగా మారే ఈ సినిమా గోపీచంద్‌కు ల్యాండ్‌మార్క్ మూవీగా ఉంటుందని ఆయన తెలిపారు.

జూన్ 14న ఈ సినిమా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది. తాప్సీ, శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.

English summary

 Gopichand, Tapsi starrer 'Sahasam' audio album will be launched on June 2nd. The movie directed by Chandrasekhar Yeleti, BVSN Prasad produce this film on Sri Venkateswara Cine Chitra banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu