»   » సాహో ఫ్యాన్స్ అద్బుతం... ఈ పోస్టర్లు చూస్తే అవాక్కవుతారు

సాహో ఫ్యాన్స్ అద్బుతం... ఈ పోస్టర్లు చూస్తే అవాక్కవుతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొన్నేళ్లుగా బాహుబలి ప్రాజెక్టులకే పరిమితమైన ప్రభాస్ ఆ సినిమా పూర్తి కావడంతో ఇటీవలే మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయాడు. తెలుగు, తమిళంతో పాటు హిందీ పరిశ్రమలో కూడా ప్రభాస్ బాగా పాపులర్ అయ్యాడు. ప్రభాస్ ఇమేజ్ కు తగిన విధంగా ఈ సినిమాను నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు సుజీత్.

ప్రభాస్ బాగా పాపులర్ అయ్యాడు

ప్రభాస్ బాగా పాపులర్ అయ్యాడు

'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ సినిమా రేంజి తెలుగు సినిమా పరిధి దాటి జాతీయ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్ సినిమాలకు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ మార్కెట్లలో కూడా డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఇపుడు ప్రభాస్ సినిమా అనగానే ఈరోస్ లాంటి పెద్ద సినీ నిర్మాణ సంస్థలు వందల కోట్లు గుమ్మరించడానికి సిద్ధపడుతున్నాయి.

శంకర్, ఎహసాన్, లాయ్

శంకర్, ఎహసాన్, లాయ్

అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్న ప్రభాస్ చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాదీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నాడు. జాతీయ స్థాయికి, బాలీవుడ్‌కు తగినట్టు సంగీతం ఉండాలనే ఉద్దేశంతో సంగీత త్రయాన్ని రంగంలోకి దించారు.

రీసెంట్ గా మోష‌న్ పోస్ట‌ర్

రీసెంట్ గా మోష‌న్ పోస్ట‌ర్

ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహం ఇంకో ఎత్తు సాహో అనే చిత్రాన్ని చేస్తున్న ప్ర‌భాస్ రీసెంట్ గా మోష‌న్ పోస్ట‌ర్ తో అల‌రించాడు. ఇది అభిమానుల‌లో వైబ్రేష‌న్ క‌లుగ చేసింది. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో యూవి క్రియేష‌న్స్ బేన‌ర్ పై సాహో చిత్రం నిర్మిత‌మ‌వుతుండ‌గా .. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఈ మూవీని ఏకకాలంలో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్ర‌భాస్ పై ఉన్న అభిమానంతో

ప్ర‌భాస్ పై ఉన్న అభిమానంతో

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కాని కొంద‌రు అభిమానులు మాత్రం ప్ర‌భాస్ పై ఉన్న అభిమానంతో సాహోకి సంబంధించి ఓ పోస్ట‌ర్ రెడీ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ని చూస్తే అచ్చం చిత్ర యూనిట్ అఫీషియ‌ల్ గా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ మాదిరిగానే ఉన్నాయి. డైరెక్ట‌ర్ సుజీత్‌ కూడా ఈ పోస్ట‌ర్ ని చూసి షాక‌య్యాడ‌ట‌.

అల్లు అరవింద్ రామాయణం

అల్లు అరవింద్ రామాయణం

మ‌రి అభిమానుల‌లో రోజు రోజుకి క్రియేటివిటి ఎక్కువ కావ‌డంతో , వారు త‌యారు చేస్తున్న సినిమా పోస్ట‌ర్స్ అస‌లుకి , డూప్లికేట్ కి తేడా తెలియ‌కుండా చేస్తుంది. ఈమధ్యనే అల్లు అరవింద్ రామాయణం అనే ప్రాజెక్ట్ మొదలు పెట్త బోతున్నాడు అని, రామ్ చరణ్ ని తీసుకుంటారేమో అన్న ఒక చిన్న వార్త బయటికి రాగానే.

అద్బుతమైన పోస్టర్లు

అద్బుతమైన పోస్టర్లు

ఆ వెంటనే అద్బుతమైన పోస్టర్లు బయటికి వచ్చాయి. అసలు కేవలం సరదాకి కదా అని లైట్ తీసుకోవటం లేదు అత్యంత శ్రద్ద తో అద్బుతంగా చేస్తున్నారు. ఒక్క సారి ఈ ఫ్యాన్ మేపోస్టర్లని మీరూ ఒకసారి చూసేయ్యండి... ఎంత ప్రేమా, అభిమానం ఉంటే ఇంత కష్టపడతారు.. మరి సాహో కూడా ఇదే స్థాయి విజయాన్ని అభిమానుల చేతుల్లో పెడుతుందా లేదా అన్నది చూడాలి.

English summary
fan made posters creats sensation in social meadia of Bahubali Star Prabas next movie SAHO
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu