»   » అద్బుతం, బాహుబలి కోసం నృత్య నీరాజనం : క్లాసికల్ డాన్సర్ రూపా కొడువయూర్ (వీడియో)

అద్బుతం, బాహుబలి కోసం నృత్య నీరాజనం : క్లాసికల్ డాన్సర్ రూపా కొడువయూర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది రోజులుగా బాహుబలి మానియా జనాలలో మరింత పెరిగింది.విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. భాషకతీతంగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఒప్పించడంలో దర్శకుడు రాజమౌళి బాహుబలిని తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యారు.2015లో వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా సినీ అభిమానులను ఒక్కటి చేసింది. ఊహలకు అందకుండా రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి 1 చూసిన వారికి, చూడని వారికి బాహుబలి 2 చూడాలనే తపన మొదలైంది. ఈ మానియా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ రాష్ట్రాల్లో కూడా జోరుగా కనిపిస్తున్నది.

బాహుబలి సిరీస్‌

బాహుబలి సిరీస్‌

బాహుబలి సిరీస్‌లో బాహుబలి, భళ్లాలదేవ, శివగామి, కట్టప్ప లాంటి పాత్రలను దర్శకుడు రాజమౌళి మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అద్భుతమైన సెట్టింగులు, హంగులు, టెక్నాలజీ లాంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాయి. అవే బాహుబలి చిత్రానికి బలమైన అంశాలుగా మారాయి.

బాహుబలి 2

బాహుబలి 2

ఇలాంటి అంశాలన్నే భారీ కలెక్షన్లు సాధించడానికి దోహదపడుతున్నాయి. బాహుబలి 2 సినిమా చూసిన తర్వాత నెటిజన్లు తమ సందేశాలతో పోటెత్తారు. స్టూడెంట్స్, ఉద్యోగుల నుంచి సినీ నటుల వరకు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి2పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రూపా కొడువయూర్

రూపా కొడువయూర్

ఇక సోషల్ మీడియా లో అయితే క్రియేటివిటీ పీక్స్ లో ఉంది, తమ క్రియేటివిటికి పదును పెడుతూ బాహుబలి2తో అసోసియేట్ అయ్యి విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీళ్ళు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా రూపా కొడువయూర్ అనే క్లాసికల్ డాన్సర్ బాహుబలి2 కి ట్రిబ్యూట్ గా ఓ క్లాసికల్ డ్యాన్స్ చేసింది.

rn

భళి భళి భళిరా భలి

బాహుబలి 2 కి మొదటి ఊపుతీసుకొచ్చిన భళి భళి భళిరా భలి పాటకి... ముద్రలతో మరింత అద్బుతమైన రూపం తెచ్చింది. ఈ డాన్స్ ని చూడటానికి నెటిజన్లు ఎగబడి పోతున్నారు. వరంగల్ కోట పరిసరాల్లోనూ, సముధ్రం పక్కనా తీసిని ఈ వీడియో ఇప్పుడు లేటెస్ట్ క్రెజ్ అయ్యింది సోషల్ మీడియా జనాలకి.

English summary
Sahore bahubali title song performed by Classical Dancer Roopa Koduvayur as a tribute to bahubali2
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu