»   » అంతా కలిసి నన్ను బుక్ చేసారు: సాయి ధరమ్ తేజ్

అంతా కలిసి నన్ను బుక్ చేసారు: సాయి ధరమ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవలే జవాన్ సినిమాను కంప్లీట్ చేసిన సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేసి సెట్స్ పై పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కరుణాకరన్ తో మరో సినిమాను ప్రారంభించాడు తేజు.

కరుణాకరన్ - సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సాయి ధరమ్ తేజ్10వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు సమర్పణలో వల్లభ నిర్మించనున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే 2 ట్యూన్స్ కూడా ఇచ్చాడు. డార్లింగ్ స్వామి డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా నుంచి ఉంటుంది.

 Sai Dharam Karunakaran movie launched

"క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఏడాది నుంచి సినిమా చేయాలని అనుకుంటున్నాం. కేఎస్ రామారావు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారు. ఎవరికి ఎలాంటి కథ వస్తుందో ముందే రాసిపెట్టి ఉంటుందని నమ్ముతా. కరుణాకరన్ రాసిన కథ ఇలా నాకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈరోజు ఇలా కుదిరింది. ఈసారి అన్నీ సెట్ అయ్యాయి. కాబట్టి నో చెప్పలేకపోయాను. ఈ సినిమా నేనే చేయాలని అంతా పట్టుబట్టారు. సో.. ఈ ఏడాది ఇలా బుక్ అయిపోయాను.

English summary
Sai Dharam Tej and Karunakaran film was launched with Pooja Ceremony today morning at 8:20 at Film Nagar Temple. Regular shoot will commence from Dussehra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu