»   »  సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ టీజర్

సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'సుప్రీమ్‌'. రాశీ ఖన్నా హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో సాయి గరమ్ తేజే తన ఫేస్ బుక్ ద్వారా సుప్రీమ్ టీజర్ ని షేర్ చేసారు. ఇక్కడ, చూడండి.

https://t.co/LEW6Wvnc8i here you go guys the first look of #Supreme .hope you guys like it and WISH YOU A VERY HAPPY NEW YEAR 󾌵

Posted by Sai Dharam Tej on Thursday, December 31, 2015

సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ '''పిల్లా నువ్వులేని జీవితం' విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' అందరికీ నచ్చడం మరింత సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు రూపుదిద్దుకొంటున్న 'సుప్రీమ్‌' కూడా అన్ని వర్గాల్నీ ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

Sai Dharam teaser of 'Supreme' released

పటాస్ సినిమాతో దర్శకుడిగా మెప్పించిన అనిల్ రావిపూడి, తన రెండో సినిమాను కూడా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింస్తున్నారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే సాయిధరమ్ తేజ మరో చిత్రం కమిటయ్యారు. కళ్యాణ్ రామ్ తో ఓం తీసిన సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం లాంచింగ్ ఈ రోజు జరిగింది. ఈ చిత్రానికి సంభందించి తిక్క అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. దానికి ట్యాగ్ లైన్ గా... ‘హ్యాండిల్ విత్ కేర్' అని పెడుతున్నట్లు తెలుస్తోంది.రోహిన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్‌రాజు నిర్మించనున్న మరో సినిమా ‘శతమానం భవతి' కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

English summary
Sai dharmtej posted in FB: 'hope you guys like it and WISH YOU A VERY HAPPY NEW YEAR'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu