»   » టాప్ 25 లో సాయిధరమ్ తేజ్ ''సుప్రీమ్''

టాప్ 25 లో సాయిధరమ్ తేజ్ ''సుప్రీమ్''

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు ''సుప్రీమ్'' సినిమాతో స్టార్ అయ్యాడా? సినిమాకు వచ్చిన తొలిరోజు కలక్షన్లను బట్టి చూస్తుంటే.. అదే నిజం అనిపిస్తోంది. మనోడు చాలామంది యువ హీరోలను దాటేసి ముందు వరసలోకి వచ్చేసాడు.

ఈ మధ్య కాలంలో వచ్చిన మెగా మూవీలు కంచె తప్ప అన్నీ వరుసగా థియోటర్స్ వద్ద బోల్తాపడటంతో సుప్రీమ్ మూవీ మాత్రం ప్రేక్షకులకి కొంత ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చిందని చెప్పవచ్చు.బ్రూస్ లీ, సర్ధార్ గబ్బర్ సింగ్ వంటి నిరుత్సాహ చిత్రాల తరువాత వచ్చిన సుప్రీమ్ మెగా ప్రేక్షకులను బాగా అలరించిందని అంటున్నారు.


సుప్రీమ్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ కి, ఈ మూవీ మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇది చిన్న కథే అయినప్పటికీ..హీరో,హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను కట్టిపడేంది.కామెడీ కూడా మంచి ప్లస్ అయ్యింది. దాంతో మనోడి ట్యాక్సీ మాంచి ఊపుమీదుంది.


Sai Dharam Tej achieved stare status..!?

''సుప్రీమ్'' సినిమా మొదటి రోజు కలక్షన్లు 4.64 కోట్లు వచ్చాయి. అందులో 4 కోట్లు తెలుగు రాష్ట్రంలలో వచ్చిన వసూళ్లే. అయితే రిలీజ్ రోజున మన దగ్గర వచ్చిన టాప్ 25 వసూళ్ళు చూసుకుంటే. మొత్తంగా బాహుబలి - మహేష్ బాబు - పవన్ కళ్యాన్ - రామ్ చరణ్ - జూ.ఎన్టీఆర్ - అల్లు అర్జున్ లే ఉన్నారు.


ఆ తరువాత ఆ లిస్టులో ఉన్న హీరోలు రవితేజ., నాగార్జున., రాజమౌళి ఈగ., వంటి వారే. ఇప్పుడు 4.64 కోట్ల కలక్షన్ తో ఏకంగా శర్వానంద్, నాని , అల్లరి నరేష్ వంటి డిపెండబుల్ స్టార్లను సైతం దాటేశాడు సాయిధరమ్. ఆ లెక్కన చూస్తే మనోడికి స్టార్ స్టేటస్ వచ్చినట్లే మరి.

English summary
Mega Hero Sai Daram Tej "supreme" movie getting good response
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu