»   » హీరోయిన్‌తో మెగా హీరో చిలిపి చేష్టలు (ఫోటోస్)

హీరోయిన్‌తో మెగా హీరో చిలిపి చేష్టలు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నూతన చిత్రం ‘సుప్రీమ్'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం ‘సుప్రీం' షూటింగ్ జైసల్మేర్ లో జరుగుతోంది. షూటింగ్ సెట్లో.... హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రాశి ఖన్నా కలిసి చిలిపిగా ఎక్స్ ఫ్రెషన్స్ ఇస్తూ దిగిన ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. సినిమా షూటింగ్ ఈ ఇద్దరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. జనవరిలో షూటింగ్ పూర్తి కానుంది.

ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణ పూర్తి చేసి మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నట్లు తెలిపారు.

సుప్రీమ్

సుప్రీమ్

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నూతన చిత్రం ‘సుప్రీమ్'.

దిల్ రాజు

దిల్ రాజు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

నటీనటులు

నటీనటులు

నటీనటులు ఈ చిత్రంలో సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, కబీర్ సింగ్ తదితరులు ఇతర తారాగణం.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: సాయి ప్రకాష్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ డైరెక్టర్: ఎ.యస్.ప్రకాష్, ఫైట్స్: వెంకట్, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: దిల్ రాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి.

English summary
Sai Dharam Tej and Rashi khanna starrer Supreme shooting At Jaisalmer.
Please Wait while comments are loading...