»   » మెగా ఫ్యామిలీ నుండి మరో న్యూ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు!

మెగా ఫ్యామిలీ నుండి మరో న్యూ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి వారసత్వంతో ఆ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలయ్యారు. ఒక్క అల్లు శిరీష్ తప్ప అందరూ సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ క్లిక్ అయ్యారు. నాగ బాబు కూడా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగ బాబు కూతురు కూడా ఇప్పటికే బుల్లి తెర ద్వారా తానేంటో నిరూపించుకుంది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. సినిమా ఫ్యామిలీలో పుట్టడంతో అతనిలోనూ నటుడు కావాలనే ఆకాంక్ష ఎప్పుడో మొదలైంది.

Sai Dharam Tej brother Vaishnav Tej Tollywood entry

గతంలో చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో పేషెంటుగా కూడా నటించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తన చదువుకు కొనసాగిస్తూ నటన, డాన్స్, ఫైట్స్ ఇలా వివిధ కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. కుర్రోణ్ణి చూస్తుంటే హీరో అవ్వాలనే ఉత్సాహం ఉట్టిపడుతోంది.

పలువురు దర్శకులు ఇప్పటికే వైష్ణవ్ తేజ్ ను కలిసారని, కథలు వినిపించారని సమాచారం. అయితే పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న తర్వాతే సినిమా రంగంలోకి వస్తానని అంటున్నాడట వైష్ణవ్ తేజ్. తన తొలి సినిమా ఎంపిక ఎలా ఉండాలన్న విషయంలో అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సలహా తీసుకుంటాడట.

English summary
Sai Dharam Tej brother Vaishnav Tej all set to make his silver screen debut very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu