»   » ఖైదీ ఎఫెక్ట్: ‘నాన్ బాహుబలి’ ఉండదేమో, మోగా హీరో మాటే నిజమైంది!

ఖైదీ ఎఫెక్ట్: ‘నాన్ బాహుబలి’ ఉండదేమో, మోగా హీరో మాటే నిజమైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం. వసూళ్ల విషయంలో ప్రభంజనం. ఈ సినిమా కలెక్షన్లు, రికార్డులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉండటంతో.... ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఏదైనా రికార్డులు క్రియేట్ చేస్తే బాహుబలితో పోల్చకుండా 'నాన్ బాహుబలి' రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పుకునే వారు.

అయితే చిరంజీవి నటించిన 150వ సినిమా 'ఖైదీ నెం 150' బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొడుతూ దూసుకెలుతోంది. వాస్తవానికి సినిమా రీలీజ్ ముందే సాయి ధరమ్ తేజ్ ఈ విషయంలో కొన్ని కామెంట్స్ చేసారు. ఇప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డులు అని చెప్పుకున్నారు. ఇకపై 'నాన్ ఖైదీ నెం 150' రికార్డులు అని చెప్పుకుంటారు అని సాయి ధరమ్ తేజ్ అన్న మాట ఇపుడు బాక్సాఫీసు సాక్షిగా నిజం అవుతోంది.

సినిమా విడుదలరోజే 'ఖైదీ నెం 150' సరికొత్త రికార్డు ఇండస్ట్రీ క్రియేట్ చేసింది. తొలి రోజు రూ. 47 కోట్ల గ్రాస్ సాధించింది. బాహుబలి తెలుగు వెర్షన్ వసూళ్లకంటే ఇది ఎక్కువ....

 ఫస్ట్ వీక్ బాహుబలి రికార్డులు బద్దలు

ఫస్ట్ వీక్ బాహుబలి రికార్డులు బద్దలు

చాలా కోట్ల ఖైదీ నెం 150... బాహుబలి ఫస్ట్ వీక్ రికార్డులను బద్దలు కొట్టింది. కృష్ణా జిల్లాలో బాముబలి తొలి వారం 3.63 కోట్ల షేర్ వసూలు చేస్తే, ఖైదీ రూ. 3.77 కోట్ల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరిలో వారానికి ఒకరోజు ముందే ఖైదీ(4.55 కోట్లు) బాహుబలి షేర్(4.48 కోట్లు)ని క్రాస్ చేసింది. తూగో , నెల్లూరు, వైజాగ్ ఏరియాలోనూ ఇదే పరిస్థితి. ఫుల్ రన్ లో బాముబలి రికార్డులను ఖైదీ బద్దలు కొడుతుందని అంటున్నారు.

 డబ్బు కోసమే, హింసించారంటూ... చరణ్‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్!

డబ్బు కోసమే, హింసించారంటూ... చరణ్‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్!

మెగా డాటర్ నిహారిక ఇంటర్వ్యూలో... తనపై ప్రేమతో కాదు, చరణ్, సురేఖ నిర్మాతలు కాబట్టి డబ్బుపై మమకారంతో తనను ఫిట్ నెస్ పేరుతో హింసించారని చిరంజీవి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ఇలాంటివి చిరు పరువు తియ్యటానికే చేస్తున్నట్లే అనిపిస్తోంది..లేకపోతే ఏంటి?

ఇలాంటివి చిరు పరువు తియ్యటానికే చేస్తున్నట్లే అనిపిస్తోంది..లేకపోతే ఏంటి?

మధ్యన సంపూర్ణేష్ బాబు సినిమా పబ్లిసిటీ వ్యవహారంలో ఓవర్ యాక్షన్ తో కామెడీ పండించారు. అయితే అదంతా సరదాకే అని అందరికీ తెలుసు. ఇప్పుడు చిరంజీవి విషయంలో.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ml

 దుర్మార్గుడు మావాడే అని చిరంజీవి చెప్పినా... ఇంకా వీడని అయోమయం!

దుర్మార్గుడు మావాడే అని చిరంజీవి చెప్పినా... ఇంకా వీడని అయోమయం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 150వ చిత్రం అనుకున్న దానికికంటే పెద్ద హిట్టే అయింది. ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరిగరాస్తూ దూసుకెలుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Sai Dharam Tej comments comes true on Khaidi No 150 collections. "All these days it is Baahubali records and Non-Baahubali records, now it's going to be Khaidi No 150 records and Non-Khaidi No. 150 records" Saidharam Tej has tweeted something very interesting few days back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu