»   »  'అలెగ్జాండర్‌' గా సాయి ధరమ్ తేజ, ఫస్ట్ లుక్ విడుదల చేసిన చరణ్

'అలెగ్జాండర్‌' గా సాయి ధరమ్ తేజ, ఫస్ట్ లుక్ విడుదల చేసిన చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సందీప్‌కిషన్‌ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నక్షత్రం'. సాయిధరమ్‌ తేజ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్రంలో యంగ్ పోలీసు అధికారి అలెగ్జాండర్‌గా కనిపించనున్నారు. ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని హీరో రామ్‌చరణ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.


అలెగ్జాండర్‌ అందరి మనసుల్ని దోచేస్తాడని సాయిధరమ్‌ తేజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ శక్తిమంతమైన పాత్రని పోషిస్తుండడం సాయిధరమ్‌ తేజ్‌ అదృష్టం అన్నారు రామ్‌చరణ్‌.


సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్‌ మరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కె. శ్రీనివాసులు, ఎస్‌. వేణుగోపాల్‌, సజ్జు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి సందీప్‌, రెజీనా, ప్రగ్యాల ఫస్ట్‌లుక్‌ను రామ్‌చరణ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.


ఇక 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా వారసుడు సాయిధరమ్‌తేజ్‌. ఈ చిత్రం అతడికి ఓ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చింది. తర్వాత నటించిన 'సుబ్రమణ్యం ఫర్‌సేల్‌', 'సుప్రీమ్‌' చిత్రాలతో హిట్‌ అందుకున్నాడు సాయిధరమ్‌తేజ్‌ . ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న విన్నర్ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
Krishna Vamsi’s upcoming action entertainer Nakshatram team is already into the promotions releasing the first looks of lead cast. Makers have released the first look of Supreme hero Sai Dharam Tej and the the mega hero looks stunning in his costumes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu