»   » బన్నీ, రామ్ చరణ్ లు రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ లో సాయి ధరం తేజ్

బన్నీ, రామ్ చరణ్ లు రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ లో సాయి ధరం తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్నామధ్య "సాహసం శ్వాసగా సాగిపో" ఆడియో వేడుకలో సాయిధరమ్‌ తేజ్‌ కనిపించినపుడు చాలామందికి సంగతేంటో అర్థం కాలేదు. సాయి.., చైతూ లు మరీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా కాదు. అయినా ఆ వేడుకలో అతనుండటానికి ఓ కారణముందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. "సాహసం శ్వాసగా.." దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్లో సాయిధరమ్‌ ఓ సినిమా చేయబోతున్నాడట.

తనని గౌతమ్ మీనన్ ప్రేమకథలు ఎంతగా ప్రభావితం చేసాయో ఒక సందర్భం లో చెప్పాడట సాయి ధరం ఆ మాటలకు మురిసిపోయిన గౌతమ్ మీనన్ సాయి ధరమ్ తేజ్ ను పిలిచి ఇలా అవకాశం ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. అందుకే సాయి ని సాహసం శ్వాసగా... ఆడియో వేడుకకి పిలిచాడట గౌతం మీనన్...

గౌతమ్ మీనన్ ప్రస్తుతం శింబుతో తమిళంలో తెలుగులో నాగచైతన్యతో తీసిన "సాహసం శ్వాసగా సాగిపో" విడుదల అయిన వెంటనే గౌతమ్ మీనన్ ఏకంగా నాలుగు భాషల్లో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ లో సాయిధరమ్ తేజ్ అనుష్క తమన్నా పృథ్వీరాజ్ పునీత్ రాజ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నటించబోతున్నారట. ఈ విషయాన్ని గౌతమ్ మీనన్ తమిళ మీడియాకి లీక్ లు కూడ ఇచ్చేస్తున్నాడు..

ఒకే కథను వేర్వేరు భాషల్లో వేర్వేరు హీరోలతో తీయడం గౌతమ్‌ కు అలవాటు. ఘర్షణ.. ఏమాయ చేసావె.. ఎటో వెళ్లిపోయింది మనసు.. లేటెస్టుగా 'సాహసం శ్వాసగా సాగిపో'.. ఇవన్నీ కూడా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ తెరకెక్కాయి. సాయిధరమ్‌ తో చేయబోయేది ఏకంగా నాలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కబోయే సినిమా అట.

Sai Dharam Tej in Gautham Menon's Direction

ఇందులో ఒక్కో భాష నుంచి ఒక్కో హీరో నటించడం కాదు. సౌత్‌ ఇండియాలోని నాలుగు ఇండస్ట్రీల నుంచి నలుగురు హీరోలు ఈ సినిమాలో కలిసి నటించబోతున్నారు. తమిళం నుంచి జయం రవి.. కన్నడ నుంచి పునీత్‌ రాజ్‌ కుమార్‌.. మలయాళం నుంచి ప థ్వీరాజ్‌లకు అవకాశం దక్కగా.. తెలుగు నుంచి సాయిధరమ్‌ ఎంపికయ్యాడు...

అయితే ఇక్కడో భయంకరమైన భారీ... పంచ్ ఉంది. ఈ భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ కొద్దికాలం క్రితం రామ్ చరణ్ అల్లుఅర్జున్ లతో చర్చించి నట్లు టాక్. అయితే ఈ మూవీ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ బన్నీలు పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ను గౌతమ్ మీనన్ కొంతకాలం అటక ఎక్కించి ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్నాడని తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం సాయి ధరం వీరిద్దరికీ సమాన స్థాయి మార్కెట్ ఏర్పరుచుకోగలడు...

English summary
If the latest reports in tinsel town are to be believed, young mega hero Sai Dharam Tej will next work with acclaimed director Gautham Vasudev Menon for a mature romantic drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu