twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ గారికో విన్నపం..: వినాయక్, వణికిపోయామన్న పృధ్వీ

    |

    సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ఇంటిలిజెంట్. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్'పై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. మాస్ ఇమేజ్ కోసం పాకులాడి గతంలో ఫ్లాప్స్ చవిచూసిన సాయిధరమ్.. ఈసారి కూడా మాస్ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో సాయిధరమ్ తేజ్ తన సినిమాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తేజుతో పాటు హాస్యనటుడు పృధ్వీ, దర్శకుడు వివి వినాయక్ చెప్పిన పలు విశేషాలు మీకోసం..

    హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో.. అవసరమా?:'సాయిధరమ్'పై కత్తి ఇలా..హీరోయిన్ పృష్ఠ భాగం మీద చేత్తో.. అవసరమా?:'సాయిధరమ్'పై కత్తి ఇలా..

    సాయిధరమ్ తేజ్ స్పీచ్..

    సాయిధరమ్ తేజ్ స్పీచ్..

    సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, నాకు ఫెయిల్యూర్స్‌ వచ్చినప్పుడు నాతో ఉన్న ఒకే ఒక సక్సెస్‌ అభిమానులు. నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి వారి కోసం ఎంత కష్టమైనా భరిస్తా. 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' వంద రోజుల ఫంక్షన్‌ రాజమండ్రిలో జరిగింది. ఆ తర్వాత ఇంత పెద్ద ఫంక్షన్‌ ఇదే కావడం సంతోషం. అందుకు కారణం అభిమానులు.

     నాలుగు ఫ్లాప్స్ తర్వాత..

    నాలుగు ఫ్లాప్స్ తర్వాత..

    నాకు నాలుగు ఫ్లాప్స్ ఎదురైన తర్వాత కూడా వినాయక్ లాంటి దర్శకుడు నాతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. చిరంజీవి గారికి 'ఖైదీ నం.150' వంటి హిట్ ఇచ్చి.. ఆ తర్వాతి సినిమా నాతో చేయడం వినాయక్ నాకు ఇచ్చిన అవకాశం. వినాయక్ గారు మరింత ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకుంటున్నా.

     వాళ్లకోసం ప్రాణమిస్తా..

    వాళ్లకోసం ప్రాణమిస్తా..

    సినిమాకు తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. చిరంజీవి గారు స్థాపించిన మెగా సామ్రాజ్యంలో ఎగిరే జెండా రెపరెపలే నా గుండె చప్పుడుగా భావించి అనుక్షణం కష్టపడుతూనే ఉంటాను. మెగాస్టార్‌, పవర్‌స్టార్‌, మెగాపవర్‌స్టార్‌, స్టైలిష్‌స్టార్‌, వరుణ్‌ వీళ్లంతా నాకు పంచ భూతాలతో సమానం. వాళ్ల కోసం నా ప్రాణాలు అర్పించడానికైనా నేను రెడీ. ఆ విషయంలో రెండో ఆలోచన లేదు.

     గడగడ వణికి పోయాం: పృధ్వీ

    గడగడ వణికి పోయాం: పృధ్వీ

    ఇంటిలిజెంట్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లేకపోయినా ధర్మాభాయ్ పేరు వింటేనే గడగడ వణికి పోయాం. రెండు సీన్లు మాతో అద్భుతంగా చేయించారు. మాతో స్టెప్పులు వేయించలేదు.. ఫైట్లు చేయించలేదు. మా డైరెక్టర్ గారు రోడ్లు వేయించారు. సినిమాలో ఏం చెప్పినా ధర్మాభాయ్ ఫోన్ వచ్చిందంటే గడగడ వణికి పోవాల్సిందే. సాయి ధరమ్‌కి ఈ సినిమా సక్సెస్ అందించాలని లక్ష్మీనరసింహ స్వామిని కోరుతున్నాను.

     పవన్‌కల్యాణ్‌కి విన్నపం: వినాయక్

    పవన్‌కల్యాణ్‌కి విన్నపం: వినాయక్

    ఈ వేదికపై నుంచి పవన్‌కల్యాణ్‌గారికి నాదో చిన్న విన్నపం. 'సినిమాల్లో నటించను' అని ప్రకటించారు. సమస్యలపై ఎంత పోరాడినా, రాజకీయంగా ఎంత ఎదిగినా, మీకు సమయం దొరికినప్పుడల్లా ఈ అభిమానుల కోసం సినిమా చేయండి ప్లీజ్‌. ఇక నిర్మాత గురించి చెప్పాలంటే.. నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు నేను పెద్ద డైరెక్టర్‌ అవుతానని నమ్మినవాళ్లలో సి.కల్యాణ్‌ ఒకరు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు.

     చిరు పవన్ కలిస్తే.. తేజు:

    చిరు పవన్ కలిస్తే.. తేజు:

    తేజూకు సొంత స్టైల్ ఉన్నా.. 'ఛమకు ఛమకు ఛాం' రీమేక్ చేస్తుంటే అన్నయ్య చిరంజీవే గుర్తొచ్చారు. కావాలని రెండు, మూడు షాట్లు పవన్‌కల్యాణ్‌ గుర్తొచ్చేలా తీశాను. వాళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో తేజూలో కనిపిస్తుంది. చిరంజీవిగారిలా పెద్ద స్టార్‌ అవుతాడు.

     లావణ్య త్రిపాఠి:

    లావణ్య త్రిపాఠి:

    వినాయక్‌తో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. తమన్ మ్యూజిక్ బాగుంది. చిరంజీవి గారి 'ఛమకు ఛమకు ఛాం' సాంగ్ నా ఫేవరెట్. సినిమా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు.

    English summary
    Tollywood star, Sai Dharam Tej and Lavanya Tripathi's mass action entertainer, 'Inttelligent' is all set for grand release on February 9. Intelligent pre release function held in Rajamundry on Sunday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X