For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "జవాన్" మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌: ఏ రోజు ఎక్కడ చెప్పేసారు

  |

  సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా , బివిఎస్ రవి దర్శకత్వం చేసిన చిత్రం జవాన్. ఈ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా చేస్తుంది. దేశానికే కాదు ప్ర‌తి ఇంటికి కూడా జ‌వాన్ వుంటాడు, వుండాలి కూడా.. దేశాన్ని ప్రాణంగా , భాద్య‌త‌గా భావించి అహ‌ర్నిశ‌లు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాడు ఆ జ‌వాన్‌... దేశంలోని త‌న ఇంటిని ఇంటిలో వారిని త‌న గుండెల్లో పెట్టుకుని భాద్య‌త‌తో కాపాడుకుంటాడు ఈ జ‌వాన్‌. అనే కాన్సెప్ట్ తో సిధ్ధ‌మైంది ఈ చిత్రం. సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ నుండి ట్రెమండ‌స్ స‌క్స‌స్ కోసం ఎదురుచూస్తున్న మెగాఅభిమానుల అంచ‌నాలు ఈ చిత్రం అందుకుంటుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా నిర్మాత‌లు గ్రాండ్ గా రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు.

  హైద‌రాబ‌ద్ న‌క్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా

  హైద‌రాబ‌ద్ న‌క్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా

  రీసెంట్ గా మ్యూజిక్ లో సెన్సెష‌న్ క్రియెట్ చేస్తూ, ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా సంగీతాన్ని అందిస్తున్న ఎస్‌. థ‌మ‌న్ అందించిన ఆడియో కి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. నవంబ‌ర్ 19న హైద‌రాబ‌ద్ న‌క్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో అత్యంత భారీ ఏర్పాట్ల మ‌ద్య‌లో మెగాఅభిమానుల స‌మ‌క్షంలో అతిర‌థ‌మ‌హ‌ర‌ధుల ఆశీర్వ‌చ‌నాల‌తో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి స‌ర్‌ప్రైజ్ గెస్ట్ లు హ‌జ‌రుకానున్నారు.

   కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం

  కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం

  ఈ సందర్భంగా దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ.... కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత ఇదే మేము టీజ‌ర్ లో చెప్పాము. ఈ డైలాగ్ విన్న‌వాళ్ళు చాలా మంది నాకు ప‌ర్స‌న‌ల్ గా కాల్ చేసి మ‌నసు పెట్టి రాశావు అని ప్ర‌శంసించారు.

   మ‌స‌సు పెట్టి రాశాను

  మ‌స‌సు పెట్టి రాశాను

  నిజంగా ఈడైలాగ్ నేను మ‌స‌సు పెట్టి రాశాను అలానే సినిమా కూడా మ‌న‌సు పెట్టి తీసాను. త‌ప్ప‌కుండా అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ చాలా భాద్య‌త‌గా కనిపిస్తాడు. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో, బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ జవాన్ కథ.

  తమన్ అద్భుతమైన ట్యూన్స్

  తమన్ అద్భుతమైన ట్యూన్స్

  ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ప్రసన్న స్పెషల్ క్యారెక్టర్ లో నటించారు. డిసెంబర్ 1న జవాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. న‌వంబ‌ర్ 19న పీపుల్స్ ప్లాజా లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాము. అని అన్నారు.

  దిల్ రాజు

  దిల్ రాజు

  చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ.... సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన జ‌వాన్ చిత్రం డిసెంబ‌ర్ 1న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నాము. న‌వంబ‌ర్ 19న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాము. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ , నా కాంబినేష‌న్ లో మ‌రో సూప‌ర్‌హిట్ గా నిలుస్తుంని ఆశిస్తున్నాను. అని అన్నారు.

  డిసెంబ‌ర్ 1న

  డిసెంబ‌ర్ 1న

  చిత్ర నిర్మాత కృష్ణ మాట్లాడుతూ... నా మెద‌టి చిత్రమే సాయిధ‌ర‌మ్ తేజ్ తో చేయ‌టం చాలా ఆనందంగా వుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్నాము. త్వ‌ర‌లో సెన్సారు కార్య‌క్ర‌మాలు కూడా పూర్తిచేసుకుని డిసెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము. ఎస్‌.థ‌మ‌న్ అందించిన ఆడియో ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీనికి సంభందించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని గ్రాండ్ గా పీపుల్స్ ప్లాజా లో చేస్తున్నాము. అని అన్నారు.

   సాయి ధరమ్ తేజ్

  సాయి ధరమ్ తేజ్

  నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు, కెమెరా మెన్ - కెవి గుహన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - బ్రహ్మ కడలి, ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, మధు, సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి, సమర్పణ - దిల్ రాజు, నిర్మాత - కృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి

  English summary
  The makers of ‘Jawaan’ are making preparations for a grand pre-release event. Huge arrangements are going on at People’s Plaza, Necklace Road in Hyderabad for pre-release event which will be held on November 19 in the presence of mega fans and blessings of eminent personalities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X